
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సంగీత ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ అలరిస్తున్నారు. అప్పట్లో సంగీతకు మంచి ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా శ్రీకాంత్ హీరో గా నటించిన పెళ్ళాం ఊరెళ్తే సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలో సంగీత అద్భుతమైన పాత్రలో నటించింది. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక తల్లిగా నటించి మెప్పించారు. అలాగే రీసెంట్ గా వచ్చిన వారసుడు సినిమాలో దళపతి విజయ్ వదినగా కనిపించారు. ఇదిలా ఉంటే కృష్ణవంశీ ఖడ్గం సినిమాలో ఆమె పాత్ర వన్ ఆఫ్ ది హైలైట్ అనే చెప్పాలి. అయితే ఆ సినిమా సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు సంగీత.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఖడ్గం సినిమాలో తనకు మేకప్ మైనస్ అయ్యిందని అన్నారు. ఆ మేకప్ లో నను నేను చూసుకోలేకపోయాను అన్నారు. ఆ సమయంలో నాకు మేకప్ వేసి అన్నపూర్ణ స్టూడియోస్ గేటు దగ్గర షూటింగ్ చేశారు.
షూటింగ్ అయిపోయిన తర్వాత చిత్రయూనిట్ అంతా వచ్చి చాలా బాగా వచ్చింది అని చెప్పారు. కానీ అక్కడ ఉన్న పబ్లిక్ మాత్రం కృష్ణవంశీకి పిచ్చి పట్టిందా..? ఆ అమ్మాయి హీరోయిన్ ఏంటి.? అని అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయ్యి బిగ్ హిట్ అయ్యి.. నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది అని ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు సంగీత.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..