Regina Cassandra: అమ్మో ఈ అమ్మడు మామూలుది కాదు.. ఏకంగా ప్రగ్నెంట్ అని అబద్దం చెప్పిందంట.

|

Jul 14, 2022 | 7:50 AM

శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది అందాల భామ రెజీనా కాసాండ్రా(Regina Cassandra). తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Regina Cassandra: అమ్మో ఈ అమ్మడు మామూలుది కాదు.. ఏకంగా ప్రగ్నెంట్ అని అబద్దం చెప్పిందంట.
Regina Cassandra
Follow us on

శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది అందాల భామ రెజీనా కాసాండ్రా(Regina Cassandra). తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత సందీప్ కిషన్ నటించిన రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో మంచి హిట్ ను అనుకుంది. ఈ సినిమా తర్వాత రెజీనాకు అవకాశాలు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించింది ఈ చిన్నది. ఆతర్వాత గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రకారులో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అలాగే బాలీవుడ్ లోనూ ఓ సినిమా చేసి అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఈ అమ్మడు జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి.

సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటుంది రెజీనా. అడవి శేష్ నటించిన ఎవరు సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఈ భామ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి కవ్వించింది. ఇక ఇప్పుడు అన్యస్ ట్యుటోరియల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ససెప్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ఇటీవలే స్ట్రీమింగ్ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఒక  స్వీట్ కోసం తాను గర్భవతిని అని అబద్దం చెప్పని చెప్పుకొచ్చింది రెజీనా.. మిస్టీ దోయ్  అనే స్వీట్ అంటే తనకు చాలా ఇష్టమని.. స్వీట్ తిందామని రాత్రిసమయంలో షాప్ దగ్గరకు వెళ్తే అతడు షాప్ కాటేశామని చెప్పడట. అప్పుడు రెజీనా నేను ప్రగ్నెంట్ ను మిస్టీ దోయ్ స్వీట్ తినాలనిపిస్తుంది అని చెప్పడంతో అతడు షాప్ తెరిచి ఆ స్వీట్ ఇచ్చాడట. ఇలా ఒక స్వీట్ కోసం ప్రగ్నెంట్ అని అబద్దం చెప్పని సరదాగా చెప్పుకొచ్చింది రెజీనా.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి