Rangasthalam: రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..

ఈ సినిమాలో మరో కీలక పాత్రలో అనసూయ నటించింది. రంగమ్మత అనే పాత్రలో అనసూయ నటించి మెప్పించింది. ఈ పాత్రతో అనసూయకు మంచి క్రేజ్ వచ్చింది. 

Rangasthalam: రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..
Rangasthalam

Updated on: Mar 31, 2023 | 1:37 PM

రామ్ చరణ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచినా సినిమాల్లో రంగస్థలం సినిమా ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయన్నీ అందుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన ఆయనను నటుడిగా మరో మెట్టు పైకెక్కించింది. చిట్టి బాబు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించాడు చరణ్. చెవిటి వ్యక్తిగా చరణ్ పలికించిన హావభావాలు సినిమాలు హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటించిన విషయం తెల్సిందే. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతన్నీ అందించారు. అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో అనసూయ నటించింది. రంగమ్మత అనే పాత్రలో అనసూయ నటించి మెప్పించింది. ఈ పాత్రతో అనసూయకు మంచి క్రేజ్ వచ్చింది.

రంగస్థలం సినిమా తర్వాత అనసూయ క్రేజ్ పెరిగిపోయింది. వరుస సినిమాలతోఫుల్ బిజీగా మారిపోయింది ఈ బ్యూటీ. అయితే రంగమ్మత్త క్యారెక్టర్ కోసం ముందుగా అనసూయ ప్లేస్ లో మరో బ్యూటీని అనుకున్నారట సుకుమార్. ఆమె ఎవరో తెలుసా. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన రాశి ని ముందుగా రంగమత్త పాత్ర కోసం సంప్రదించారట సుక్కు.

అయితే   ఆ పాత్ర వస్త్రాలంకరణ నచ్చక ఆమె నొ చెప్పిందని టాక్. ఇక రాశి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించారు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన సమయంలో నిజం సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అమ్మ, అత్త పాత్రలు చేస్తున్నారు.

Raasi