Pooja Hegde: సినిమాలు ఫ్లాప్ అయినా నాకు నష్టమేమీ జరగలేదంటున్న బుట్టబొమ్మ

|

Apr 19, 2023 | 7:32 AM

ఒక లైలా కోసం అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైన పూజా ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ రాణించింది. కేవలం తెలుగులోనే కాదు హిందీ, తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసి హిట్స్ అందుకుంది.

Pooja Hegde: సినిమాలు ఫ్లాప్ అయినా నాకు నష్టమేమీ జరగలేదంటున్న బుట్టబొమ్మ
Pooja Hegde
Follow us on

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు పూజ హెగ్డే. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది ఈ చిన్నది. ఒక లైలా కోసం అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైన పూజా ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ రాణించింది. కేవలం తెలుగులోనే కాదు హిందీ, తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. ఇదిలా ఉంటే కొంతకాలంగా ఈ అమ్మడు నటించిన తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యంగా ప్రభాస్ సరసన నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్  లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. తాజాగా ఈ సినిమాల రిజల్ట్ పై స్పందించింది ఈ చిన్నది.

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ.. సినిమాలు ఫ్లాప్ అయినా నేను మాత్రం ఫెయిల్ అవ్వలేదు అంటుంది ఈ బ్యూటీ. నేను నటించిన  4, 5 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. కానీ నేను ఫెయిల్ అవ్వలేదు. నా  నటనకు, డ్యాన్సులకు మంచి ప్రశంసలు దక్కాయి అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం పూజా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమాలో పూజా తో పాటు శ్రీ లీల కూడా నటిస్తోంది. అలాగే హిందీలో సల్మాన్ తో కలిసి కిసీ క భాయ్ కిసీ క జాన్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.