
Malavika: తెలుగు తెరకు చాలా మంది అందాల భామలు పరిచయం అయ్యారు. వీరిలో చాలా మంది ఎక్కువ కాలం రాణించలేక పోయారు. ఆ లిస్ట్ లో ఈ అమ్మడు కూడా ఒకరు. ఆమె పేరు మాళవిక. ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన చాలా బాగుంది సినిమాతో పరిచయం అయ్యింది ఈ అందాల భామ. పలు సినిమాల్లో నటించిన మాళవిక(Malavika) వివాహం తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. తాజాగా ఆమె ఓ టాక్ షోలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలువురు హీరోల సినిమాల్లో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా చాలా బాగుంది సినిమా షూటింగ్ సమయంలో హీరో శ్రీకాంత్(Srikanth)తో జరిగిన ఓ సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ సమయంలో డాన్స్ మూమెంట్స్ తనకు అంత కంఫర్ట్ గా లేవని చెప్పారట మాళవిక. దాంతో హీరో శ్రీకాంత్ కు కోపం వచ్చిందట
షూటింగ్ నుంచే శ్రీకంత్ కోపంతో వెళ్లిపోయారట. ఆ తరువాత మూడు రోజుల పాటు ఆ పాటని షూట్ చేసినా ఇద్దరం మాట్లాడుకునేవాళ్లం కాదు అని మాళవిక చెప్పుకొచ్చారు. అలాగే అజిత్ తో నటించిన సినిమా సమయంలోనూ అదే సంఘటన జరిగిందట. ‘ఉన్నై తేడి’ అనే సినిమాలో అజిత్ సరసన నటించారు మాళవిక. ఆ సినిమాలో కూడా ఒక రొమాంటిక్ సాంగ్ సమయంలో అజిత్ కి తగినట్టుగా నేను ఫ్రీ మూమెంట్ ఇవ్వలేక పోయారట. దాంతో అజిత్ అసహనం వ్యక్తం చేశారని మాళవిక తెలిపారు. ఇలా చాలా అనుభవాలు ఉన్నాయి అంటూ మాళవిక చెప్పుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :