Keerthy Suresh: స్కిన్ షో పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన కీర్తిసురేష్.. ఏమన్నదంటే

|

Apr 24, 2022 | 9:57 AM

రామ్ పోతినేని హీరోగా వచ్చిన నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అందాల భామ కీర్తిసురేష్. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

Keerthy Suresh: స్కిన్ షో పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన కీర్తిసురేష్.. ఏమన్నదంటే
Keerthy Suresh
Follow us on

రామ్ పోతినేని హీరోగా వచ్చిన నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అందాల భామ కీర్తిసురేష్(Keerthy Suresh). తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత కీర్తిసురేష్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తక్కువ టైం లోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది ఈ చిన్నది. ఇక ఈ అమ్మడు తెలుగు తో పాటు తమిళ్ లోను వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది. అలాగే కమర్షియల్ సినిమాలతోపాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ మెప్పిస్తుంది. అయ్యితే కెరీర్ బిగినింగ్ నుంచి కీర్తి సురేష్ గ్లామర్ షో కు నోచెప్తూ వస్తుంది. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎపిక చేసుకుంటుంది ఈ చిన్నది. ఇప్పుడున్న హీరోయిన్స్ అంత వీలైనంతగా అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంటే కీర్తి మాత్రం నా రూటే సపరేటు అంటుంది. గ్లామర్ రోల్స్ చేయకపోవడానికి రీజన్ ఏంటో గతంలో చాలా సార్లు చెప్పుకొచ్చింది ఈ చిన్నది.

తాజాగా మరోసారి స్పందిస్తూ.. తాజా ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్ మాట్లాడుతూ .. నా కెరీర్ బిగినింగ్ నుంచి కూడా నేను నటనపైనే ఎక్కువ దృష్టి పెట్టాను. నా అదృష్టం కొద్దీ అలాంటి పాత్రలే వచ్చాయి. అలాగే సినిమాల్లో గ్లామరస్ గా కనిపించే విషయంలో కొన్ని లిమిట్స్ పెట్టుకున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోను నేను వాటిని క్రాస్ అవ్వను. అందువల్లనే గ్లామరస్ గా కనిపించే పాత్రలకు దూరంగా ఉంటున్నాను. నా ఆలోచన విధానం .. నా నటన నచ్చిన ప్రేక్షకులు నన్ను తప్పకుండా అభిమానిస్తారని భావిస్తున్నా”.. చెప్పుకొచ్చింది కీర్తిసురేష్. ప్రస్తుతం కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాత సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. మే 12 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: తెలుగు సినిమా ఇండియన్‌ సినిమా అని గర్వపడేలా చేశారు.. దర్శకధీరుడిపై మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..

Rashmi Gautam: కవ్వించే సోయగాల కలువ కళ్ళ సుందరి.. రష్మి గౌతమ్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Ram Charan: ‘అజాదీ కా అమృత్ మహోత్సవ్‌’లో సందడి చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్