Yash: కొత్త రేంజ్ రోవర్ కారు కొన్న యశ్.. ఫ్యామిలీతో కలిసి షికారు.. ధర ఎంతో తెల్సా..?
తన భార్య పిల్లలతో కలిసి కొత్త కారులో షికారుకు వెళ్లాడు యశ్. ప్రజంట్ ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కొత్త కారు కొన్న యశ్‌ను అందరూ అభినందిస్తున్నారు. ఆయన కెరీర్‌లో మరిన్ని విజయాలు సాధించాలని విషెస్ చెబుతున్నారు.
నటుడు యశ్ ఇప్పుడు శాండల్‌వుడ్ హీరో మాత్రమే కాదు. ‘కెజిఎఫ్: సిరీస్’ పాన్-ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత అతని రేంజ్ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లింది. పలు ప్రతిష్టాత్మక బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉంటూ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అందుకు తగ్గట్టుగా అతని లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది. ఇప్పుడు యశ్ ఇంటికి కొత్త లగ్జరీ కారు వచ్చింది. రేంజ్ రోవర్ కారును యశ్ తాజాగా కొనుగోలు చేశారు. తన భార్య రాధిక పండిట్.. పిల్లలు యథర్వ్, ఐరాతో కలిసి కొత్త కారుతో ఫోటోలు దిగాడు యశ్. ప్రజంట్ ఆ కారు ధర ఎంత అని అభిమానులు కూడా గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. కొత్త కారు కొన్నందుకు అందరూ యశ్‌కు ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ కొత్త రేంజ్ రోవర్ కారు ధర 4 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. దానిలో ఎన్నో లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయట.
New One #RangeRover ?@TheNameIsYash #YashBOSS #Yash #Yash19 pic.twitter.com/Mf7tf4e2Wx
— Vijay MN (@NameIsVijayMN) June 15, 2023
కాగా యష్ కొత్త సినిమా ఇంకా సెట్ కాలేదు. అతని 19వ సినిమాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు? నిర్మాత ఎవరు..? సినిమా టైటిల్ ఏంటి వంటి ప్రశ్నలతో ఫ్యాన్స్ సతమతమవుతున్నారు.’కేజీఎఫ్: చాప్టర్ 2′ సక్సెస్ తర్వాత, భారీ గ్యాప్ తీసుకున్నాడు యశ్. సరైన ప్రిపరేషన్‌తో కొత్త సినిమాను ప్రారంభించాలనేది అతని ఆలోచనగా తెలుస్తోంది. అందుకే కొత్త సినిమా అనౌన్స్ చేయడానికి టైం పడుతోంది.
కాగా నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న మూవీపై బాలీవుడ్‌లో డజన్ల కొద్దీ గాసిప్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల సెలక్షన్ జరుగుతుంది. సీత పాత్రలో అలియా భట్, రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తారని సమాచారం. అదే విధంగా యష్‌కి రావణుడి పాత్ర ఆఫర్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ పాత్ర చేయడానికి యష్ అంగీకరించలేదని లేటెస్ట్ అప్‌డేట్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.