
ఈ వాలెంటైన్స్ డే వీక్ కావడంతో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో విశ్వక్ సేన్ నటించిన ఫంకీ సినిమా ఒకటి, సీతాపయనం, కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఒకటి. అయితే గతంలో సీతాపయనం సినిమాలో ముందుగా విశ్వక్ సేన్ నటించాలిసిన సినిమా.. ఆ సినిమా సమయంలో అర్జున్ కు, విశ్వక్ కు మధ్య విబేధాలు రావడంతో ఆ సినిమా నుంచి విశ్వక్ బయటకు వచ్చేశాడు. ఆ సినిమా సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. విశ్వక్ పై అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఇద్దరి సినిమాలు ఒకే రోజున విడుదలకానున్నాయి. దాంతో అర్జున్ సీతాపయనం ప్రమోషన్స్ లో అర్జున్ విశ్వక్ సేన్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సినిమా కూడా అదే రోజు వస్తుంది అని యాంకర్ చెప్పగానే.. విశ్వక్ యంగ్ హీరో.. తనకు చాలా ఫ్యూచర్ ఉంది. మా ఇద్దరి మధ్య ఎదో కుదరలేదని అతని పై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. మేము షూటింగ్ చేసేటప్పుడు విశ్వక్ తల్లి చేతి భోజనం తిన్నాను, అతడు బాగుండాలని కోరుకుంటానని కాలంతో పాటు కొన్ని మర్చిపోవాలని, రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకున్నారు అర్జున్. అలాగే అర్జున్ కామెంట్స్ పై విశ్వక్ సేన్ స్పందించాడు.
తాజాగా ఓ ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఆయన మాట్లాడింది నాకు చాలా మంచిగా అనిపించింది అని అన్నాడు విశ్వక్. ఈరోజు ఉన్న కోపం రేపు ఉండదు. అదే కదా జీవితం అంటే.. రెండు సినిమాలు ఒకేరోజు రిలీజవుతున్నాయి. ఆయన చాలా మంచి విషయాలు మాట్లాడారు. అది విని నాకు మంచిగా అనిపించింది. మా సినిమాతో పాటు విడుదలవుతున్న సీతాపయనం, కపుల్ ఫ్రెండ్లీ సినిమాలు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి