HanuMan: స్పైడర్ మాన్, సూపర్ మాన్ కాదు అసలు హీరో ఆయనే.. తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

|

Nov 22, 2022 | 9:27 AM

ఇక ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. జాంబీరెడ్ది సినిమాతో హీరోగా మారిన తేజ తొలి సినిమాతోనే మంచి హీట్ అందుకున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

HanuMan: స్పైడర్ మాన్, సూపర్ మాన్ కాదు అసలు హీరో ఆయనే.. తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Hanuman
Follow us on

యంగ్ హీరో తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి అలరించాడు. ఇక ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. జాంబీరెడ్ది సినిమాతో హీరోగా మారిన తేజ తొలి సినిమాతోనే మంచి హీట్ అందుకున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తేజ రెండు మూడు సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు మరోసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హను-మాన్ అనే టైటిల్ తో రానుంది. ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో అంటూ ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఏ ఏ సందర్భంగా హీరో తేజ మాట్లాడుతూ..

హనుమాన్.. గాలి కంటే వేగంగా ప్రయాణించగలిగిన వారు, బుద్ధిలో శ్రేష్టులు, వానర యోధుల్లో ముఖ్యులు, ఇంద్రియాలని జయించినవారు, సాక్ష్యాత్తు శ్రీరామచంద్రమూర్తి దూత. ఇంతకంటే సూపర్ హీరో మనదగ్గర ఎవరున్నారు. సూపర్ హీరో అనగానే స్పైడర్ మాన్, సూపర్ మాన్ అని భావిస్తుంటారు. సినిమాలో చూసింది వాళ్ళనే. కానీ వాళ్ళు స్ఫూర్తిపొందింది మన కల్చర్ నుండి, మన హనుమంతులవారి నుండి. వాళ్ళ సూపర్ హీరోలు ఫిక్షనల్ మాత్రమే. హనుమంతులవారు మన చరిత్ర. మన కల్చర్. ఇది మన సత్యం. అలాంటి గొప్ప దేవుడు హనుమంతుడి అనుగ్రహంతో ఒక కుర్రాడికి సూపర్ పవర్ వస్తే ఏం చేస్తాడనేది మా హను -మాన్.

ఇంతగొప్ప సినిమాలో పాత్రకు న్యాయం చేస్తానని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మకి థాంక్స్ చెప్పడం చిన్న మాటే అవుతుంది. ఆయనతో  ఇదివరకే ఒక సినిమా చేశాను. ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నాం. ప్రశాంత్ గారు గ్రేట్ క్రాఫ్ట్ మాన్. ఆయనతో ప్రతి క్షణం లెర్నింగ్ ప్రాసస్ వుంటుంది. సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. హనుమంతులవారి గురించి చెప్పినపుడు వినయం, నిజాయితీ, గొప్ప అనే మాటలు చెబుతాం. మా సినిమా కూడా అంతే వినయంగా నిజాయితీతో సినిమా చేశాం. కానీ సినిమా చాలా గొప్పగా వుండబోతుంది.

ఇవి కూడా చదవండి

ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇస్తుంది. నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి సినిమా అంటే చాలా ప్యాషన్. అంత ప్యాషన్ వున్న నిర్మాతకు పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ అందరం చాలా కష్టపడి చేశాం. నాలుగు సినిమాల కష్టం ఈ సినిమా కోసం పడ్డాను. ఈ సినిమా రావడం కూడా దైవ సంకల్పం అని నమ్ముతున్ననాను. త్వరలోనే మీ అందరినీ థియేటర్ లో కలుస్తాం అని చెప్పుకొచ్చాడు తేజ.