పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పవన్ . అలాగే పవన్ లైనప్ చేసిన సినిమాల పై కూడా దృష్టి పెడుతున్నారు. పవన్ ఇప్పటికే మూడు నాలుగు సినిమాలను లైనప్ చేశారు. వాటిలో ఓజీ సినిమా ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సాహో సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా పవన్ ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, గ్లింప్స్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాంతో ఈ మూవీ పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది.
ఓజీ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనుంది. అలాగే ఈ సినిమాలో థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ మ్యూజిక్ ను దాదాపు పూర్తి చేశారు థమన్. ఇటీవలే ఇండియన్ ఐడల్ సింగర్స్ తో ఓజీ కోసం ఓ పాట పాడించారు థమన్. ఇక ఇప్పుడు ఓ స్టార్ హీరోతో పవన్ సినిమాలో పాట పాడించారు థమన్.
‘స్టార్ హీరో శింబు ఓజీ కోసం ఓ క్రేజీ సాంగ్ ను పాడారు. ఇక ఈ సినిమాలో స్పెషల్ గా సాంగ్స్ ఉండవట.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో వినిపించే పాటలే ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే టీజర్ లో వినించిన సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు హీరో శింబు పాడిన పాట సినిమాకే హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో పవన్ ఎలివేషన్స్ ఆదిరిపోతాయని అంటున్నారు. ఇక హీరో శింబు ఇప్పటికే తెలుగులో చాలా పాటలు ఆలపించారు. ఇక పవన్ లైనప్ చేసిన సినిమాల్లో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా, క్రిష్ డైరెక్షన్ లో హరిహరవీరమల్లు సినిమాలు ఉన్నాయి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్స్ లో పవన్ పాల్గొంటారని తెలుస్తోంది.
U know it ⚔️
&
We call it The #OG 🔥🗡️Mass RAMPAGE SOON 🏹 pic.twitter.com/ZwSoCU5TZA
— thaman S (@MusicThaman) September 22, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.