Pawan Kalyan: జల్సా థియేటర్లో ఆ హీరో రచ్చ.. ప్రేక్షకులతో కలిసి కాగితాలు చింపి విసిరేస్తూ హంగామా
Sai Dharam Tej: కొత్త సినిమా రిలీజులేవి లేకపోయినా గత రెండు రోజులుగా థియేటర్ల వద్ద పవర్‌స్టార్ ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజైన ఆయన సినిమాలు తమ్ముడు, జల్సాలను చూసేందుకు ఎగబడుతున్నారు.
Sai Dharam Tej: కొత్త సినిమా రిలీజులేవి లేకపోయినా గత రెండు రోజులుగా థియేటర్ల వద్ద పవర్‌స్టార్ ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజైన ఆయన సినిమాలు తమ్ముడు, జల్సాలను చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ స్పెషల్ షోస్ తో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పవన్ మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా అభిమానులతో కలిసి హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జల్సా సినిమాను ఎంజాయ్ చేశారు. తోటి అభిమానులతో కలిసి తను కూడా పేపర్లు ఎగరవేస్తూ సందడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి. కాగా ఈ స్పెషల్ షోలతో వచ్చే డబ్బును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని ఇది వరకే పవన్ అభిమాన సంఘాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇక సాయి ధరమ్ తేజ్ విషయానికొస్తే.. గతేడాది రిపబ్లిక్ సినిమాలో చివరిగా కనిపించాడు. సినిమా విడుదలకు ముందు జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. చాలా రోజుల వరకు ఆస్పత్రిలోనే గడిపాడు. ఇప్పుడిప్పుడే మళ్లీ అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఇటీవల అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటించిన రంగ రంగ వైభవంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ సందడి చేశాడు. యాక్సిడెంట్ నాటి చేదు అనుభవాలను గుర్తుకుతెచ్చుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.