Sulthan movie : ఆ ఫైట్ థియేటర్‌లో చూస్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశా…
హీరో కార్తి నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ ‘సుల్తాన్’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి బక్కియరాజ్ కణ్ణన్ దర్శకుడు.
Sulthan movie : హీరో కార్తి నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ ‘సుల్తాన్’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి బక్కియరాజ్ కణ్ణన్ దర్శకుడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు నిర్మించారు. ఈ మూవీని తెలుగు రాష్రాల్లో కార్తికేయ ఎగ్జిబిటర్స్ ద్వారా వరంగల్ శ్రీను ఏప్రిల్2న గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా హీరో కార్తి మాట్లాడుతూ.. `ముందుగా వెల్డ్‌డాగ్ సక్సెస్ అయిన సందర్భంగా మా అన్నయ్య నాగార్జునకి బిగ్ కంగ్రాచ్యులేషన్స్. కొత్త కంటెంట్‌ని తీసుకురావడానికి ఒక బోల్డ్ అటెంప్ట్ చేశారు. మంచి కంటెంట్ తీసుకువస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు అని ప్రూవ్ చేశారు. సుల్తాన్ మూవీని ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్లకి ఈ సినిమాలో ఫైట్స్ చాలా బాగా నచ్చాయి. ఈ సినిమా తీసిందే చిన్నపిల్లల నుండి పెద్దవారిదాకా అందరూ ఎంజాయ్ చేయాలని. అది నిజమైంది. దర్శకుడు భాగ్యరాజ్ మంచి కాన్సెప్ట్‌తో వందమంది అన్నయ్యల మధ్య నేను ఉంటే ఎలా ఉంటుంది అని చూపించారు. అన్ని అంశాల్నిసృషిస్తూ ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించారు. యువన్ శంకర్ రాజా తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాని మరింత ఎలివేట్ చేశాడు. సాంగ్స్ చాలా బాగా కుదిరాయి. అందరూ ఇంటర్వెల్ బ్లాక్ ,క్లైమాక్స్ ఫైట్స్ గురించే మాట్లాడుతున్నారు. అలాగే నైట్ ఫైట్ థియేటర్‌లో చూస్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాని దర్శకుడు రాస్తున్నప్పుడు ఎప్పుడు నన్ను ఒక లీడర్‌గా చూడలేదు.. ఒక తమ్ముడిగా ఏం చేయాలో అది మాత్రమే చేపించాడు. ఈ సినిమాలో ఎక్కడ కూడా వల్గారిటీ లేదు. అందుకే లవ్ స్టోరీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే 100మంది రౌడీలను మార్చడమే ఈ సినిమా..వారిని మార్చే క్రమంలో.. వ్యవసాయం చేస్తే మీరు ఎవ్వరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు.. అని ఒక బ్యూటిఫుల్ ఆల్టర్‌నేట్ ఇచ్చాడు దర్శకుడు భాగ్యరాజ్. ఆ పాయింట్ ఎమోషనల్‌గా కూడా బాగా కనెక్ట్ అయ్యింది. ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వరంగల్ శ్రీను ఒక సినిమాని కేవలం బిజినెస్ పరంగానే కాకుండా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి చూస్తాడు. మంచి సక్సెస్ వస్తున్నందుకు కంగ్రాచ్యులేషన్స్ శ్రీను.. తెలుగులో నా కెరీర్‌లో సుల్తాన్ సినిమాకి బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చింది. అన్నయ్య వదిన సినిమా చూసి.. అంత మందిని ఎలా మేనేజ్ చేశారు అని అడిగారు..మంచి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఈ సినిమాలో ఉంది. థియేటర్‌లో సినిమా చూడండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు“ అని అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :