
“నేను లోకల్”, “ధమాకా”, “మజాకా” వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథరావు ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నేను రెడీ అనే ఆసక్తికర టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు త్రినాథరావు. ఇక ఈ సినిమాలో హవీష్ హీరోగా నటిస్తున్నాడు. హవీష్ గతంలో “నువ్విలా”, “జీనియస్”, “రామ్ లీలా” వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం ఒక వినోదాత్మక కుటుంబ కథగా రూపొందుతోంది. హవీష్ బర్త్‌డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ నుంచి వీడియో గ్లింప్స్ ను విడుదల చేశారు.
ఈ చిత్రం టైటిల్ మరియు గ్లింప్స్ 2025 జూన్ 26న (నేడు) హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. షూటింగ్‌లో కొంత భాగం పూర్తయింది. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల కానుంది. గత సినిమాల మాదిరిగానే త్రినాథరావు ఈ సినిమాను కూడా కామెడీ కంటెంట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను నిఖిల కోనేరు, హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
త్రినాథరావు చివరిగా తెరకెక్కించిన మజాకా సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాతో హిట్ అందుకొని మళ్లీ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. ఇక హీరోయిన్ కావ్య థాపర్ చివరిగా డబుల్ ఇస్మార్ట్ సినిమాలో మెరిసింది. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు నేను రెడీ సినిమాతో ఈ అమ్మడు హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. నేను రెడీ సినిమాకు మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి