టీవీ సీరియల్‌లో ఎక్కువ క్రేజ్ ఉన్న సీరియల్ ఏది అంటే చాలా మంది టక్కున చెప్పే పేరు కార్తిక దీపం. ఈ సీరియల్‌కు ఇంతగా క్రేజ్ ఎందుకు వచ్చింది అంటే దానికి కారణం వంటలక్క వల్లే అనే చెప్పాలి. ఈ సీరియల్ కు మంచి టీఆర్పీతో దూసుకుపోతుంది. స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి సమయంలో ప్రసారం అయ్యే ఈ సీరియల్ కోసం ఆడాళ్ళు తెగ ఎదురుచూస్తారు. ఈ సీరియల్ లో వంటలక్క తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆమె పేరు ప్రేమి విశ్వనాథ్. ఈ నటి కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క పాత్రలో నటించి మెప్పించింది.. ప్రేమి విశ్వనాథ్ కేరళ రాష్ట్రానికి చెందిన నటి.. కానీ తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కార్తీక దీపం సీరియల్ మొదటి భాగం ఇప్పటికే పూర్తయ్యి. ఇప్పుడు కార్తీక దీపం: నవ వసంతం అనే పేరుతో కొత్త భాగం మొదలు పెట్టారు.
ఇక ప్రేమి విశ్వనాథ్ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.. ఆమె ఫ్యామిలీ ఏంటి.? బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది పెద్దగా ఎవరికీ తెలియదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రేమి విశ్వనాథ్ తన ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేయదు. కానీ ఇటీవల కొడుకుతో కలిసి కొన్ని రీల్ చేసింది. ఈ క్రమంలోనే క్రిస్మస్ సందర్భంగా ఆమె ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.
తాజాగా ప్రేమి షేర్ చేసిన వీడియో చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నడా..! అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. క్రిస్మస్ విషెస్ తెలుపుతూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఆమె కొడుకు అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. చాలా ఫిట్ గా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు అతను. ఈ వీడియోకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నాడు. బ్రదర్ అండ్ సిస్టర్‌లా ఉన్నారు, సంతూర్ మమ్మీ, మీకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా .? నిజం చెప్పండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి