జ‌న‌సేన‌కు హ‌రీశ్ శంక‌ర్ బూస్ట్ !

|

Aug 08, 2020 | 12:13 PM

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రాబోతుంద‌ని తెలిసినప్ప‌టి నుంచి అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.

జ‌న‌సేన‌కు హ‌రీశ్ శంక‌ర్ బూస్ట్ !
Follow us on

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రాబోతుంద‌ని తెలిసినప్ప‌టి నుంచి అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. వ‌ర‌స ప్లాపుల‌తో ఉన్న ప‌వ‌న్‌కు గ‌తంలో గ‌బ్బ‌ర్‌సింగ్‌తో ఇండ‌స్ట్రీ అదిరిపోయే హిట్ ఇచ్చాడు హరీశ్. అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ కిందే చెప్పుకోవాలి. కమ‌ర్షియ‌ల్ సినిమాల‌ను తెర‌కెక్కించడంలో మంచి ప‌ట్టున్న వ్య‌క్తిగా హ‌రీశ్‌కు మంచి పేరుంది. మ‌రోసారి ఈ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్‌తో ఆ మ్యాజిక్ రిపీట్ చెయ్యాల‌ని ఫ్యాన్స్ ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ చిత్ర గురించి ప‌లు ఊహాగానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ప‌వ‌న్ రాజకీయ నాయకుడిగా క‌నిపిస్తాడ‌ని టాక్. ఓ సామాన్యుడు ప్ర‌స్తుత విధానాల‌పై విర‌క్తి చెంది రాజ‌కీయాల్లోకి వ‌చ్చి వ్య‌వ‌స్థ‌లో ఎలా మార్పు తీసుకొస్తాడ‌నే అంశాల్ని ఈ సినిమా క‌థ‌లో చూపిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప‌వ‌న్ పొలిటికల్ కెరీర్‌కి ఈ చిత్రం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంటున్నారు. హరీశ్ మాత్రం ఈ చిత్రం ప‌క్కా మాస్ ఎంట‌ర్టైన‌ర్ అంటున్నాడు. లెట్స్ వెయిట్ అండ్ సీ.

 

Also Read :సుశాంత్ రాజ్ పుత్ కేసు, రియాను 10 గంటలపాటు విచారించిన ఈడీ