Director Prashanth Varma: ‘హనుమాన్’ బ్లాక్ బస్టర్ హిట్.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నిర్ణయం ఇదే ?..

సూపర్ హీరో ఆంజనేయుడి పాత్రను స్పూర్తిగా తీసుకుని తెరకెక్కించిన ఈ మూవీ నిజంగానే అద్భుతంగా ఉందంటూ సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఈ సినిమా వీఎఫ్ఎక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఆయన పేరు మారుమోగుతోంది. ఇప్పటివరకు దాదాపు రూ. 260 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్రేకుల్ లేని బుల్డోజర్ లా దూసుకుపోతుంది ఈ మూవీ.

Director Prashanth Varma: హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నిర్ణయం ఇదే ?..
Prashanth Varma

Updated on: Jan 31, 2024 | 7:53 PM

సంక్రాంతి పండక్కి చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించింది ‘హనుమాన్’. వరుసగా మూడు పెద్ద చిత్రాలు విడుదలవుతున్నాయ్.. రిలీజ్ విషయంలో వెనక్కు తగ్గాలని చెప్పినా.. తమ కంటెంట్ పై నమ్మకంతో ముందడుగు వేసి సక్సెస్ అయ్యారు. సూపర్ హీరో ఆంజనేయుడి పాత్రను స్పూర్తిగా తీసుకుని తెరకెక్కించిన ఈ మూవీ నిజంగానే అద్భుతంగా ఉందంటూ సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఈ సినిమా వీఎఫ్ఎక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఆయన పేరు మారుమోగుతోంది. ఇప్పటివరకు దాదాపు రూ. 260 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్రేకుల్ లేని బుల్డోజర్ లా దూసుకుపోతుంది ఈ మూవీ. ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులతో సత్తా చాటుతుంది. ఈ మూవీ భారీ విజయంతో నిర్మాతలకు పెద్ద మొత్తంలోనే లాభాలు వచ్చాయి.

తేజ సజ్జా హీరోగా.. అవర్ గాడ్‌ హనుమాన్ బేస్డ్‌ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో… హనుమాన్ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సంక్రాంతి కానుకగా.. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా.. పాన్ ఇండియా రేంజ్లో సెన్సేషనల్ హిట్టైంది. వరల్డ్‌ వైడ్ 300కోట్ల మార్క్‌ వైపు పరుగెడుతోంది. ఇక ఈ క్రమంలోనే టాలీవుడ్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.

అదేంటంటే..! హనుమాన్ మూవీ.. కలెక్షన్స్ కుమ్మేయడంతో… భారీగా గిట్టుబాటు చేసుకున్న ప్రశాంత్ వర్మ.. ఆ సంతోషంలో తన కోరికను తీర్చుకున్నారట. 6 కోట్ల విలువైన బ్రాండ్ న్యూ రేంజ్‌ రోవర్‌ కారును బుక్ చేశారట. ఆ కార్‌ కోసం ఈగర్‌గా వెయిట్ కూడా చేస్తున్నారట. అయితే ఈ న్యూస్ ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చి.. నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. సక్సెస్‌ వల్ల.. వచ్చే అడిషనల్ కిక్కిదే అనే కామెంట్ కూడా వస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.