Gurthunda Seethakalam : అందమైన ప్రేమ భావాలను మొఖంలో అద్భుతంగా పలికిస్తున్న ప్రేమపావురాలు…

|

Feb 15, 2021 | 2:22 AM

కంటెంట్ ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుంటూ త‌నదైన శైలిలో న‌టిస్తూ ప్రేక్ష‌కాభిమానం సొంతం చేసుకుంటున్న యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కీబ్యూటీ త‌మన్నా జంటగా..

Gurthunda Seethakalam : అందమైన ప్రేమ భావాలను మొఖంలో అద్భుతంగా పలికిస్తున్న ప్రేమపావురాలు...
Follow us on

Gurthunda Seethakalam : కంటెంట్ ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుంటూ త‌నదైన శైలిలో న‌టిస్తూ ప్రేక్ష‌కాభిమానం సొంతం చేసుకుంటున్న యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కీబ్యూటీ త‌మన్నా జంటగా న‌టిస్తున్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నాగ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్ పై నాగ‌శేఖ‌ర్‌, భావ‌న ర‌వి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కన్నడ చిత్రం ‘లవ్ మాక్టైల్’కు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమానుంచి ప్రేమికుల రోజు కానుకగా పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో హీరో హీరోయిన్లు ఒకరి చేతులు మరొకరు. ఒకరి కళ్ళలోకి మరొకరు ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ ఫస్ట్ లుక్.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తమన్నా, సత్యదేవ్ ఇద్దరు తమ భావాలను మొఖంలో అద్భుతంగా పలికించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన ఈ లుక్ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు తమన్నా .. గోపీచంద్ నటిస్తున్న సీటిమార్ సినిమాలో నటిస్తుంది. అలాగే సత్యదేవ్ తిమ్మరుసు అనే సినిమా చేస్తున్నాడు.

మరిన్ని ఇక్కడా చదవండి : 

“ప్రభాస్ ను నేనే పరిచయం చెయ్యాలి…కానీ ఆ కారణం వల్ల కుదరలేదు”.. అసలు విషయం చెప్పిన దర్శకేంద్రుడు ..