Jyothi Rai Poorvaj : కిల్లర్‏గా మారిన సీరియల్ బ్యూటీ.. చూపులతోనే చంపేస్తోన్న జగతి మేడమ్..

|

Nov 03, 2024 | 3:03 PM

కన్నడలో పలు సీరియల్స్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే జనాల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. ఇక తెలుగు అడియన్స్ గురించి చెప్పక్కర్లేదు. కట్టు, బొట్టు, యాక్టింగ్ నచ్చిందంటే చాలు గుండెల్లో గుడి కట్టేస్తారు. అలా ఓ సీరియల్ ద్వారా తెలుగు ప్రజల మనసులలో చెరగని స్థానం సంపాదించుకుంది. కానీ ఇప్పుడు వెబ్ సిరీస్ లతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రచ్చ చేస్తుంది.

Jyothi Rai Poorvaj : కిల్లర్‏గా మారిన సీరియల్ బ్యూటీ.. చూపులతోనే చంపేస్తోన్న జగతి మేడమ్..
Jyothi Rai
Follow us on

తెలుగు బుల్లితెర ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు జగతి మేడమ్.. అలియాస్ జ్యోతి పూర్వజ్. ఓ ఛానల్లో అత్యధిక రేటింగ్‏తో టాప్ 1లో దూసుకుపోయిన గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో జగతి మేడమ్ పాత్రలో అద్భుతమైన నటనతో అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇందులో కొడుకు ప్రేమ కోసం తల్లడిల్లే తల్లి పాత్రలో.. స్టూడెంట్ చదువు కోసం పోరాడే టీచర్ పాత్రలో సహజమైన నటనతో మెప్పించింది. అయితే ఈ సీరియల్ నుంచి ఆకస్మాత్తుగా తప్పుకున్న జ్యోతి పూర్వజ్.. ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్ అంటూ చాలా బిజీగా మారిపోయింది. అంతేకాదు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం హాట్ గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తుంది నెట్టింట రచ్చ చేస్తుంది.

సీరియల్లో కట్టు, బొట్టుతో ఎంతో హుందాతనంగా కనిపించిన జ్యోతిపూర్వజ్.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు ఊహించని రేంజ్ లో కనిపించి షాకిచ్చింది. ప్రస్తుతం ఆమె శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ పూర్వజ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తుంది. వీటిలోనూ జ్యోతి నటించింది. డైరెక్టర్ పూర్వజ్ ను జ్యోతి రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు భర్త డైరెక్షన్లోనే కిల్లర్ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రాబోతున్న ఈ కిల్లర్ ఫ్రాంచైజీలో ఇది తొలి సినిమా. ఈ చిత్రానికి కిల్లర్ పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ అనే టైటిల్ కూడా పెట్టారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో జ్యోతి ఓఅద్దం ముందు చేతిలో గొడ్డలి.. మరో చేతిలో కూరగాయలు పట్టుకుని కనిపిస్తుంది. కానీ అద్దంలో మరోవైపు రోబోలా కనిపిస్తున్నట్లు ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ తెలియాల్సింది ఉంది.

ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.