Gully Rowdy teaser: కామెడీ ఎంటర్‌టైనర్ గా రానున్న గల్లీ రౌడీ.. ఆకట్టుకుంటున్న టీజర్

|

Apr 20, 2021 | 6:03 AM

రెండు కోట్ల రూపాయ‌ల డ‌బ్బు కోసం ఓ ఫ్యామిలీ కిడ్నాప్ చేయాల‌నుకుంటుంది. అందుకోసం ఆ ఫ్యామిలీ విశాఖ‌ప‌ట్నంలోని ఓ కుర్ర రౌడీ క‌లిస్తే ..

Gully Rowdy teaser: కామెడీ ఎంటర్‌టైనర్ గా రానున్న గల్లీ రౌడీ.. ఆకట్టుకుంటున్న టీజర్
Sundeep Kishan
Follow us on

Gully Rowdy teaser: రెండు కోట్ల రూపాయ‌ల డ‌బ్బు కోసం ఓ ఫ్యామిలీ కిడ్నాప్ చేయాల‌నుకుంటుంది. అందుకోసం ఆ ఫ్యామిలీ విశాఖ‌ప‌ట్నంలోని ఓ కుర్ర రౌడీ క‌లిస్తే ..ఏమ‌వుతుంది? ఎవ‌రన్నా వాడి మ‌న‌వ‌డ్ని ఇంజ‌నీర్‌ని చేస్తాడు, డాక్ట‌ర్ చేస్తాడు. బాగా బ‌లిసికొట్టుకుంటే ఎమ్మెల్యేని చేస్తాడు.. కానీ ఓ తాత త‌న మ‌న‌వ‌డిని రౌడీని చేయ‌మేంటి?

ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కావాలంటే ‘గల్లీ రౌడీ’ సినిమా చూడాల్సిందేన‌ని అంటున్నారు ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర్ రెడ్డి. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్య‌మైన క‌థా చిత్రాల్లో, పాత్ర‌ల్లో న‌టిస్తున్న యంగ్ హీరో సందీప్ కిష‌న్ హీరో గా  నటిస్తోన్న చిత్రం ‘గల్లీ రౌడీ’. నేహా శెట్టి హీరోయిన్. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తోన్న ఫన్ ఎంటర్‌టైనర్ ‘గల్లీ రౌడీ’. చిత్రీకరణను పూర్తి చేసుకున్నఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా  ‘గల్లీ రౌడీ’ టీజర్‌ను రౌడీ హీరో ‘విజయ్ దేవరకొండ’ విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

టీజర్ చాలా ఆసక్తికరంగా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. అసలు ‘గల్లీ రౌడీ’ కథాంశం ఏంటి… ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఈ టీజర్‌లో రివీల్ చేశారు.రైట‌ర్ కోనవెంక‌ట్ క‌థ‌ను ఫ‌న్ రైడ‌ర్‌గా క‌థ‌ను మ‌లిచిన విధాం, సందీప్ కిషన్ తనదైన డిఫరెంట్ రోల్‌లో నటించారని టీజర్‌ను చూస్తే అర్థమవుతుంది. కామెడీ ఎంటర్‌టైనర్స్‌ను తనదైన శైలిలో తెరకెక్కించే డైరెక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డి, మరోసారి తనదైన స్టైల్లో తెరకెక్కించాడు. కామెడీ కింగ్, నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ డిఫరెంట్ రోల్‌తో ప్రేక్షకులకు నవ్వులను పంచబోతున్నారు. బాబీ సింహ కీల‌క పాత్ర‌లో న‌టించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

స్జేజ్ పై డ్యాన్స్ చేస్తూ కింద పడ్డ ప్రముఖ సింగర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

Sameera Reddy: నాతో పాటు నా పిల్లలకు కూడా కరోనా బారిన పడ్డారు.. జాగ్రత్తగా ఉండమంటూ ఎమోషనల్ పోస్ట్

Karthika Deepam: కార్తీక్ నిజంగా మారాడా.. లేక జాలిపడుతున్నాడా అని ఆలోచిస్తున్న సౌందర్య.. మోనిత శనిలా పట్టుకుందన్న భాగ్యం