అతని గొంతులోనే ఎదో మ్యాజిక్ ఉంది.. ఎంతోమంది ఫెవరెట్ సింగర్ ఆయన

|

Aug 20, 2024 | 7:09 PM

మన దగ్గర ఎంతో అద్భుతమైన సింగర్స్ ఉన్నారు. తమ గాత్రంతో పాటలకు పాణం పోస్తున్నారు. లెజెండ్రీ సింగర్ బాలసుబ్రమణ్యం ఎన్నో వేల పాటలను ఆలపించారు. ఆయన స్పూర్తితో చాలా మంది సింగర్ శ్రోతలను అలరిస్తున్నారు. కాగా పైన కనిపిస్తున్న సింగర్ ను గుర్తుపట్టారా..? ఆయన గొంతులోనే ఎదో మ్యాజిక్ ఉంది. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను ఆలపించారు ఆయన. తన గొంతులోనే ఎదో ఫీల్ ఉంది.

అతని గొంతులోనే ఎదో మ్యాజిక్ ఉంది.. ఎంతోమంది ఫెవరెట్ సింగర్ ఆయన
Tollywood
Follow us on

ఒక సినిమా హిట్ అవ్వాలంటే సంగీతం కూడా ఎంతో ప్రాధాన్యత వహిస్తుంది. సినిమాలు ఫ్లాప్ అయినా మ్యూజిక్ హిట్ అయినవి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పాటలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంటాయి. ఇక మన దగ్గర ఎంతో అద్భుతమైన సింగర్స్ ఉన్నారు. తమ గాత్రంతో పాటలకు పాణం పోస్తున్నారు. లెజెండ్రీ సింగర్ బాలసుబ్రమణ్యం ఎన్నో వేల పాటలను ఆలపించారు. ఆయన స్పూర్తితో చాలా మంది సింగర్ శ్రోతలను అలరిస్తున్నారు. కాగా పైన కనిపిస్తున్న సింగర్ ను గుర్తుపట్టారా..? ఆయన గొంతులోనే ఎదో మ్యాజిక్ ఉంది. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను ఆలపించారు ఆయన. తన గొంతులోనే ఎదో ఫీల్ ఉంది. ఆయన పాడుతుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంతకు ఆతను ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : Vishwambhara: బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ హీరోయిన్.. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా ఈ హాట్ బ్యూటీ..

పై ఫొటోలో ఉన్న సింగర్ ఎవరో కాదు ఆయన పేరు కార్తీక్. సింగర్ కార్తీక్ అంటే తెలియని మ్యూజిక్ లవర్ ఉండరు. ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించారు కార్తీక్. కార్తీక్ గాయకుడిగా తన ప్రస్థానాన్ని బ్యాకింగ్ వోకలిస్ట్ గా మొదలుపెట్టి అతి తక్కువ కాలం లోనే తెలుగు, తమిళ చిత్రసీమలో ప్రముఖ గాయకుడిగా ఎదిగాడు. ఇప్పటికి దాదాపు 1,000 పైగా పాటలను తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ బాషలలో పాడారు. కార్తీక్ చిన్ననాటి నుంచే సంగీతం అంటే మక్కువ పెంచుకున్నాడు. స్కూల్ కి వెళ్ళే రోజుల్లో కర్ణాటక సంగీతం కొంత కాలం నేర్చుకున్నాడు.

ఇది కూడా చదవండి : అప్పుడు రవితేజ లవర్‌గా.. ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌లో ఇలా..! ఈ హీరోయిన్ ఎంత మారిపోయింది..!!

ఆతర్వాత చిన్న గ్యాప్ ఇచ్చి 17ఏళ్ల వయసులో తిరిగి గాయకుడిగా ప్రస్థానం మొదలు పెట్టాడు. కాలేజిలో చదివే రోజుల్లో స్నేహితులతో కలిసి ఒక మ్యూజిక్ గ్రూప్ లా ఏర్పడి అనేకమైన పోటీలలో పాల్గొన్నాడు. ఆతర్వాత సినిమా గాయకుడిగా మారాడు. బాయ్స్ సినిమాలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి రా.., గజినీ సినిమాలోని  ఒక మారు కలిసిన బంధం …, .హ్యాపీ డేస్ సినిమాలోని అరరే అరరే మనసే జారే.., కొత్త బంగారు లోకం నిజంగా నేనేనా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయి. కార్తీక్, ఏ.ఆర్.రెహమాన్, ఇళయరాజా, విద్యాసాగర్, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, హరిస్ జై రాజ్, మిక్కీ జే మేయర్.. ఇలా చాలా మందితో పనిచేసాడు. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నాడు.

ఇది కూడా చదవండి : అడిగినంత ఇవ్వలేదని రాజమౌళి సినిమాకు నో చెప్పిన బ్యూటీ.. గోల్డెన్ ఆఫర్ మిస్ చేసుకుంది

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..