అందం, అభినయం ఉన్నా అదృష్టం నిల్.. 12 సినిమాలు చేస్తే రెండే హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

ఈ టాలీవుడ్ హీరోయిన్ నటించిన మొదటి సినిమానే సూపర్ హిట్. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. తన అందం, అభినయంతో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుసగా ప్లాఫులు పడ్డాయి.

అందం, అభినయం ఉన్నా అదృష్టం నిల్.. 12 సినిమాలు చేస్తే రెండే హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
Payal Rajput Birthday Special

Updated on: Dec 05, 2025 | 6:24 PM

పై ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోయిన్లలో ఈ బ్యూటీ కూడా ఒకరు. ఓవైపు హీరోయిన్ గా గ్లామర్ ఒలకపోస్తూన మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ నటించడం ఈ అమ్మడి స్టైల్. అయితే ఈ అమ్మడికి అదృష్టం కలిసి రావడం లేదు. సినిమాల రంగా అందం, అభినయం ఉన్నా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగలేకపోతోంది. వెంకటేష్, రవితేజ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసినా సక్సెస్ అవ్వడం లేదు. యంగ్ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నా వర్కవుట్ అవ్వడం లేదు. ఈ బ్యూటీ ఇప్పటివరకు తెలుగులో దాదాపు 12 కు పైగా సినిమాలు చేసింది. అయితే అందులో చెప్పుకోదగ్గ హిట్స్ రెండు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ఈ ఏడాది ఒక్క సినిమాలోనూ కనిపించలేదీ అందాల తార. అయితే ఆమె చేతిలో ఇప్పుడు మూడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో ఒక్కటి హిట్ పడినా ఈ ముద్దుగుమ్మ రేంజ్ అమాంతం పెరుగుతుంది.

సినిమాల్లో బోల్డ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ నిజ జీవితంలోనూ బోల్డ్ గా ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో రొమాంటిక్ అండ్ గ్లామరస్ ఫొటోషూట్స్ తో గత్తరలేపుతుంటుంది. ఈ బ్యూటీ ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది. మరి ఆ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు పాయల్ రాజ్ పుత్. శుక్రవారం (డిసెంబర్ 05) ఆమె పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ బ్యూటీకి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదే క్రమంలో పాయల్ చిన్ననాటి ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

కాగా ఆర్ ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది పాయల్. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. గోల్ మాల్, ఏంజెల్, కిరాతక అనే మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటోందీ అందాల తార. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.