Anushka Shetty: అనుష్క శెట్టి ఒడిలో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా.. ? ఆ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయింది..

సాధారణంగా తెలుగు సినీ ప్రపంచంలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు అలరించారు. కానీ కొందరు మాత్రం పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న చిన్నారి ఒకరు. కేవలం ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా లెవల్లో పాపులర్ అయ్యింది. అందులో ఆమె నటన చూసి సినీ విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Anushka Shetty: అనుష్క శెట్టి ఒడిలో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా.. ? ఆ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయింది..
Anushka Shetty

Updated on: Jun 22, 2026 | 7:10 PM

పైన ఫోటోలో లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ఒడిలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? తెలుగులో ఫేమస్ చైల్డ్ ఆర్టిస్టు. కేవలం ఒక్క సినిమాతోనే నటిగా అందరి ప్రశంసలు అందుకుంది. అంతేకాదు పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె మరెవరో కాదు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రంలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఫర్జానా సయ్యద్. నిజానికి సలార్ పేరు చెప్పగానే అందులో కాటేరమ్మ ఫైట్ గుర్తొస్తుంది. ఈ మూవీలో కాటేరమ్మ ఫైట్ సీన్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. ముఖ్యంగా ప్రభాస్ చేతులకు ఉన్న సంకెళ్లను తెంచుకుని అడ్డొచ్చిన వారిని నరుకుతూ వెళ్లిపోతాడు. సినిమా మొత్తానికి ఈ సీన్ హైలెట్. ఇక ఇందులో ప్రభాస్ ఫైట్ చేయడానికి కారణం ఈ చిన్నారే. సలార్ సినిమాతో యావత్ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది ఈ చిన్నారి. ఈసినిమాతోపాటు తెలుగులో ఓరి దేవుడా, ఝాన్సీ వంటి చిత్రాల్లో నటించింది.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..

సలార్ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ చిన్నారి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. సినిమాలో అమాయకంగా కనిపించిన ఈ చిన్నారి సోషల్ మీడియాలో మాత్రం చాలా అందంగా కనిపిస్తుందని.. అప్ కమింగ్ హీరోయిన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‏లో ఉన్న వెబ్ సిరీస్..

హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా కథ అంతా ‘ఖాన్సార్’ అనే ఒక ఊహాజనిత, క్రూరమైన సామ్రాజ్యం చుట్టూ తిరుగుతుంది. బాల్య స్నేహితులైన దేవా (ప్రభాస్), వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ల మధ్య ఉన్న బలమైన బంధం.. కాలక్రమేణా ఖాన్సార్ సింహాసనం కోసం జరిగే రాజకీయాల వల్ల ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే ఈ చిత్ర ముఖ్య కథాంశం. వరదరాజ మన్నార్‌ను రక్షించడానికి, అతని సామ్రాజ్యాన్ని కాపాడటానికి దేవా ఒక ‘సలార్’ (రక్షకుడు/సైన్యాధిపతి) గా ఎలా మారాడనేది ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్‌తో చూపించారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..

 సలార్ సినిమా  చైల్డ్ ఆర్టిస్ట్..

Farzana Sayyed

ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..

Follow Us