ఈ ఫోటోలోని చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా.? ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. పవన్, చిరు, మహేష్‌తో నటించింది..

|

Apr 30, 2023 | 10:45 AM

పైన పేర్కొన్న ఫోటోలోని చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడొక స్టార్ హీరోయిన్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి..

ఈ ఫోటోలోని చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా.? ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. పవన్, చిరు, మహేష్‌తో నటించింది..
Guess The Actress
Follow us on

పైన పేర్కొన్న ఫోటోలోని చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడొక స్టార్ హీరోయిన్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి.. 23 ఏళ్లు కెరీర్‌లో మలయాళం, తమిళ, తెలుగు భాషల్లో చిత్రాల్లో చేసింది. దక్షిణాదిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్ హీరోల సరసన నటించింది. అందం, అభినయంలో ‘మహానటి’గా పేరుగాంచింది. ఈ హీరోయిన్‌కి ఫ్యాన్స్‌లో పాపులారిటీ కూడా ఎక్కువే. అటు హోమ్లీ లుక్‌లోనే కాదు.. ఇటు మాస్ లుక్‌లోనూ అవలీలగా నటించగలిగే సత్తా ఈమె సొంతం. మరి ఈ అమ్మడు ఎవరో ఈపాటికి మీకే అర్ధమై ఉంటుంది. ఆమె మరెవరో కాదు.. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో కీర్తి సురేష్ చిన్నప్పటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ‘సర్కారు వారి పాట’, ‘నేను లోకల్’, ‘రెమో’, ‘నేను శైలజా’, ‘సర్కార్’ లాంటి హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది. ‘దసరా’ మూవీతో హిట్ కొట్టిన కీర్తి సురేష్.. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ మూవీలో, తమిళంలో మరో నాలుగు చిత్రాల్లో నటిస్తోంది.