Tollywood: ఈ ఫోటోలో అమ్మాయి ఎవరో గుర్తుపట్టండి ?.. ఆమె గాత్రం వింటే మైమరచిపోవాల్సిందే.

ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా ?.. ఆమె పాట పాడితే కోయిల సైతం అసూయపడుతుంది. దక్షిణాది సినీపరిశ్రమలో వేలాది పాటలు ఆలపించి శ్రోతలను ఆకట్టుకుంది. ఆమె స్వరం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ప్రేమను చూపించడమే కాదు.. ఆమె గాత్రం నవ్విస్తుంది.. మదిని తాకి కన్నీరు పెట్టిస్తుంది.

Tollywood: ఈ ఫోటోలో అమ్మాయి ఎవరో గుర్తుపట్టండి ?.. ఆమె గాత్రం వింటే మైమరచిపోవాల్సిందే.
Tollywood

Updated on: Jul 27, 2023 | 1:21 PM

పైన ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా ?.. ఆమె పాట పాడితే కోయిల సైతం అసూయపడుతుంది. దక్షిణాది సినీపరిశ్రమలో వేలాది పాటలు ఆలపించి శ్రోతలను ఆకట్టుకుంది. ఆమె స్వరం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ప్రేమను చూపించడమే కాదు.. ఆమె గాత్రం నవ్విస్తుంది.. మదిని తాకి కన్నీరు పెట్టిస్తుంది. భయపెడుతుంది. ఇలా అన్ని భావోద్వేగాలను పలికిస్తుంది. తనే లెజండరీ సింగర్ కె.ఎస్ చిత్ర. ఈరోజు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అభిమానులు. 1963 జూలై 27న కేరళలోని త్రివేండ్రంలోని సంగీతకారుల కుటుంబంలో జన్మించింది చిత్ర. అసలు పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి. చిన్నతనంలోనే ఆలిండియా రేడియోలో రెండేళ్ల కృష్ణుడికి పాట పాడింది చిత్ర.

1979లో చిత్ర గురువు ఎం.జి. రాధకృష్ణన్ ఆమె చేత మాలయాళి సినిమాలో ఓ పాట పాడించాడు. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత 1982లో మళ్లీ ఓ యుగళగీతం పాడింది. సింధుభైరవి సినిమాలో పాడలేని పల్లవైన భాషరాని దానను అనే పాటను తెలుగుతోపాటు తమిళంలో చిత్ర పాడింది. తెలుగులో ఆమె పాడిన మొదటిపాట ఇదే. ఆ తర్వాత దక్షిణాది సినీపరిశ్రమలో వేలాది పాటలు పాడింది. చిత్ర గాత్రానికి మెచ్చిన భారత ప్రభుత్వం 2005లో పద్మశ్రీ, 2021లో పద్మభూషణ్ పురస్కారాలతో సన్మానించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.