ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ తారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. త్రోబ్యాక్ ట్రెండ్ పేరుతో టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీల అరుదైన ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ అందాల తార లేటేస్ట్ ఫోటో తెగ వైరలవుతుంది. పైన ఫోటోలో ఉన్న నిశీధిలో అందాల జాబిలి ఈ ముద్దుగుమ్మ. చీకట్లో దాగివున్న ఈ చందమామ ఎవరో గుర్తుపట్టారా ?.. ఈ అమ్మాడి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. సౌత్ టూ నార్త్ ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. నిజానికి ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ భామ. అయినా తెలుగులోనూ నటించి మెప్పించింది. ఎవరో గుర్తుపట్టండి.
ఆ అందాల జాబిలి మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. డైరెక్టర్ మహేష్ భట్.. నటి సోని రజ్దాన్ కుమార్తె అలియా. 1992 మార్చి 15న జన్మించిన అలియా.. 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో తెరంగేట్రం చేసింది. మొదటి చిత్రంతోనే నటనపరంగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది.
హైవే, షాందార్, కపూర్ అండ్ సన్స్, డియర్ జిందగీ, బద్రీనాథ్ కి దుల్హనియా, సడక్ 2, గంగూబాయి కతియావాడి సినిమాలతో నటిగా ప్రశంసలు అందుకుంది. ఇక ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించి మెప్పించింది. 2022 ఏప్రిల్ 14న ముంబయిలో తన ప్రియుడు హీరో రణబీర్ కపూర్ ను వివాహం చేసుకుంది. వీరికి 2022 నవంబర్ 6న పాప జన్మించింది. ప్రస్తుతం అలియా తన కూతురితో సమయాన్ని గడుపుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.