Tollywood: స్క్రీన్‌పై పద్ధతిగా కనిపించే ఈ నటి.. బయట మాత్రం చాలా హాట్ గురూ

|

May 25, 2024 | 1:16 PM

ఒక సీరియల్ హిట్టు కొట్టిందంటే అందులో చేసే హీరో, హీరోయిన్ కు విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది. వారికి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ వస్తుంది. అలా తెలుగులో చాలానే హిట్టు సీరియల్స్ ఉన్నాయి. అలాంటి ఒక హిట్టు సీరియల్ లో ఈ అమ్మడు హీరోయిన్ గా చేస్తోంది.

Tollywood: స్క్రీన్‌పై పద్ధతిగా కనిపించే ఈ నటి.. బయట మాత్రం చాలా హాట్ గురూ
Serial Actress
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు అన్నా.. సినిమా స్టార్స్ అన్నా ఎప్పటికీ ఓ క్రేజ్ ఉంటుంది. సినిమాలతో పాటు సీరియల్స్‌ను కూడా అంతేస్థాయిలో ఆదరిస్తారు. ముఖ్యంగా గృహిణులు.. కొన్ని సీరియల్స్‌కు బాగా అడిక్ట్ అయి ఉంటారు. పొద్దుకూకగానే మొదలయ్యే ఈ సీరియల్స్.. నైట్ 9 వరకు కొనసాగుతాయి. ఇక ఆ సీరియల్స్‌లో చేసే ఆర్టిస్టులకు కూడా ఇప్పుడు మాంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే ఈ బ్యూటీకి కూడా మన దగ్గర మంచి ఫాలోయింగ్ ఉంది.

ఒక సీరియల్ క్లిక్ అయితే చాలు అందులో వివిధ పాత్రలు చేసేవారికి విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది. వారికి సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోతారు. అలా తెలుగులో చాలామంది పాపులర్ అయ్యారు. అలాంటి ఒక హిట్టు సీరియల్ లో ఈ క్యూటీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఆ సీరియల్‌కు మస్త్ క్రేజ్ ఉంది. ఆమెను అభిమానించేవారు కూడా బోలెడు మంది ఉన్నారు. తెలుగులో చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా కన్నడ బిగ్ బాస్ లో కూడా ఒక ఊపు ఊపేసి వచ్చింది. ఇంతకీ తనెవరో కాదండోయ్.. అమూల్య గౌడ. తెలుగులో గుండెనిండా గుడి గంటలు అనే సీరియల్ ద్వారా ఈమె చాలా ఫేమస్. టీవీ సీరియల్స్ చూసేవారు ఈ ధారావాహికలోని మీనా- బాలు పాత్రలకు బాగా కనెక్ట్ అయిపోయారు.

అమూల్య గౌడకు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 5 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. డాన్స్, రీల్స్, మేకోవర్ అంటూ చాలానే వీడియోస్ చేసి ఈమె ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటూ పోతుంది. ఈ అమ్మడు అటు కన్నడలో ఇటు తెలుగులో ఆర్టిస్టులకు టఫ్ కాంపిటేషన్ ఇస్తుంది. అయితే సీరియల్ లో పద్దతిగా ఉండే అమూల్యను చూసి.. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో హాట్ పిక్స్ చూసినప్పుడు ఈమెలో ఇంత మార్పు ఏంటని కొందరు చేస్తుంటారు. ఆమె అటు ట్రెడిషన్, ఇటు ఫ్యాషన్ రెండింటిని మేనేజ్ చేయగలదని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.