
పైన ఫోటోలో కనిపిస్తున్న అందాల నాట్య మయూరిని గుర్తుపట్టారా.. ? హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు అతడు తన సినిమా కోసం కొత్త అవతారం ఎత్తారు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? ప్రస్తుతం అతడి వయసు 63 సంవత్సరాలు. తండ్రి సూపర్ స్టా్ర్. సోదరుడు సైతం స్టార్ హీరో. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోకు సైతం ఇండస్ట్రీలోనే అత్యధిక ఫాలోయింగ్ ఉంది. ఇంతకీ అతడు ఎవరో గుర్తుపట్టారా.. ? పైన ఫోటోలో నాట్యమయూరిగా మారిన హీరో మరెవరో కాదండి.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్. కన్నడ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ అయిన ఆయన ఇటీవల జైలర్ చిత్రంలో నటించి మెప్పించారు.
జైలర్ చిత్రంలో రజనీకాంత్ తో సమానంగా మాస్ ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో అదరగొట్టేశారు. ఆ తర్వాత కెప్టెన్ మిల్లర్ చిత్రంలో కూడా నటించారు. కన్నడ రాజ్ కుమార్ పెద్ద కుమారుడు శివరాజ్ కుమార్ బాలనటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టాడు. తరువాత, తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ కన్నడ సినిమాలో హీరోగా దూసుకుపోతున్నారు. ఓం (1995), జోగి (2005), బజరంగీ (2013), ముఫ్తీ (2017), ఠాకూర్ (2018) వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో మెప్పించారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర దర్శకత్వం వహించిన ఓం చిత్రంతో శివరాజ్ కుమార్ కెరీర్ మలుపు తిప్పింది. కన్నడలో ఇప్పటివరకు 128 చిత్రాల్లో నటించారు. 120 సినిమాల్లో హీరోగా మెప్పించారు.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పెద్ది సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు శివరాజ్ కుమార్. అలాగే శివరాజ్‌కుమార్ ఉపేంద్ర, రాజ్ పి శెట్టి తో కలిసి 45వ చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల అయ్యింది. ఇందులో శివరాజ్ కుమార్ స్త్రీ పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాపై మరింత బజ్ నెలకొంది.
ఇవి కూడా చదవండి : 11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తెలుగులో తోపు హీరోయిన్..సైన్యంలో పనిచేసి ఉరి దాడిలో మరణించిన తండ్రి..