Tollywood: ఈ అక్కా తమ్ముళ్లు ఇప్పుడు తెలుగులో స్టార్ హీరో, హీరోయిన్స్.. ఎవరో గుర్తు పట్టారా?

సినిమా ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుంచి ఎంతో మంది నటులు పరిచయమవుతూనే ఉన్నారు. అందులో చాలా మంది స్టార్ హీరో, హీరోయిన్లుగా క్రేజ్ అందుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఈ అక్కా తమ్ముళ్లు కూడా సరిగ్గా ఇదే జాబితాకు చెందుతారు.

Tollywood: ఈ అక్కా తమ్ముళ్లు ఇప్పుడు తెలుగులో స్టార్ హీరో, హీరోయిన్స్.. ఎవరో గుర్తు పట్టారా?
Maheshwari, Udhay Avishek

Updated on: Jan 28, 2026 | 8:32 PM

పై ఫొటోలో కనిపిస్తున్న ఆక్కాతమ్ముళ్లు ఎవరో గెస్ చేయగలరా. ఇప్పుడు వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీ స్టార్ సెలబ్రిటీస్. ఒకరు ఇప్పటికే తన అందం, అభినయంతో సినిమ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మరొకరు ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్నారు. అక్క బాటలోనే నడుస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. సినిమా ఇండస్ట్రీలో వీరికి చాలా పెద్ద బ్యాక్ గ్రౌండే ఉంది. ఈ ఇద్దరు కూడా ఓ పాపులర్ స్టార్ హీరోయిన్ కజిన్స్ కావడం విశేషం. ఆమె జాడలోనే నడుస్తూ ఈ అక్కాతమ్ముళ్లు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ముఖ్యంగా ఈ ఫొటోలోని అమ్మాయి తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ ను కట్టి పడేసింది. తమిళ, కన్నడ చిత్రాల్లోనూ మెరిసిన ఈ అందాల తార స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాలు చేసింది. కొన్ని సీరియల్స్ లోనూ యాక్ట్ చేసి బుల్లితెర ప్రేక్షకులకు కూడా చేరువైంది.

మరి ఆమె ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ.. ‘ ఈ వేళలో నీవు.. ఏం చేస్తూ ఉంటావో’ అంటూ ఒకప్పుడు యూత్ ను తన అందంతో కట్టి పడేసిందీ హీరోయిన్. యస్. ఆమె మరెవరో కాదు పెళ్లి, గులాబి సినిమాల హీరోయిన్ మహేశ్వరి. ఆమె పక్కన ఉన్నది తమ్ముడు ఉదయ్ కార్తీక్ కుమార్ అలియాస్ ఉదయ్ అవిషేక్ కార్తీక్.

ఇవి కూడా చదవండి

సోదరుడు ఉదయ్ తో నటి మహేశ్వరి..

మహేశ్వరి అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవికి కూతురు వరుస అవుతుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అప్పుడప్పుడు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లో మాత్రం సందడి చేస్తుంది. ఇక మహేశ్వరి తమ్ముడు ఉదయ్ అవిషేక్ కార్తీక్.. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మేనన్ దగ్గర అసోసియేటివ్‌గా పనిచేసి ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు.

యాంకర్ ఝాన్సీతో మహేశ్వరి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి