
పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈ చిన్నబాబు ఒకప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో. తన నటనతో అమ్మాయిల మనసులను కొల్లగొట్టేశాడు. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ప్రధానంగా లవ్ స్టోరీలు, కామెడీ సినిమాలతో అమ్మాయిలకు, ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. ముఖ్యంగా అమ్మాయిలకు ఫేవరేట్ హీరో అయిపోయాడు. ఇక మధ్యలో వయసు ప్రభావంతో పాటు వరుస పరాజయాలతో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నా సెకెండ్ ఇన్నింగ్స్ లో మళ్లీ సత్తా చాటుతున్నారు. విలన్ గా నూ, సపోర్టింగ్ ఆర్టిస్టుగానూ వరుస విజయాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా ఉంటోన్న ఆర్టిస్టుల్లో ఆయన కూడా ఒకరు. తీరిక లేని షూటింగులతో నిత్య బిజి బిజీగ ఉండే ఈ యాక్టర్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. . తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో పంచుకుంటుంటారు. అలా తాజాగా తన చిన్నప్పటి ఫొటోలతో చేసిన ఓ అందమైన వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇది ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. మరి ఆ నటుడెవరో గుర్తు పట్టారా? ఆయన మరెవరో కాదు జగ్గూ భాయ్ అలియాస్ జగపతి బాబు.
కాగా 63 ఏళ్ల జగపతి బాబు తీరిక లేని షూటింగులతో బిజి బిజీగా గడుపుతున్నారు. గతేడాది ఆయన నటించిన ఐదు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయంటే జగ్గూ భాయ్ క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు జగపతి బాబు. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటున్నారు. అలాగే తన జిమ్, వర్కవుట్ ఫొటోలు, వీడియోలను పంచుకుంటున్నారు.
meeru naku nacharu, nenu meeku mechhana. pic.twitter.com/lfSx7dbUtx
— Jaggu Bhai (@IamJagguBhai) February 12, 2025
జగపతి బాబు ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ సీ 16 (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగులో బిజీగా ఉంటున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మరో కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు.
Chaala Kaalam tharavaatha @BuchiBabuSana #RC16 ki manchi pani pettaadu.. get up choosina tharavaatha Naaku chaala thrupthi ga undhi. pic.twitter.com/aaiQ8HPErp
— Jaggu Bhai (@IamJagguBhai) January 16, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.