Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. భర్త కూడా స్టార్ హీరోనే

|

Jan 11, 2025 | 11:57 AM

ఈ ఫొటోలో ఉన్న పాపను ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. తన అందం, అభినయంతో కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టింది. తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ ఈ భామకు బోలెడు క్రేజ్ ఉంది. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ భర్త కూడా ఓ స్టార్ హీరోనే.

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. భర్త కూడా స్టార్ హీరోనే
Tollywood Actress
Follow us on

మహారాష్ట్రకు చెందిన ఈ ముద్దుగుమ్మ మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. అయితే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేసింది. కెరీర్ ప్రారంభంలోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. కానీ స్టార్ స్టేటస్ మాత్రం అంత త్వరగా రాలేదు. అయితే బాలీవుడ్ లో ఈ బ్యూటీ నటించిన ఓ బోల్డ్ వెబ్ సిరీస్ సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ అమ్మడి పేరు మార్మోగిపోయింది. తెలుగులోనూ వరుసగా అవకాశాలు వచ్చాయి. మహేశ్ బాబు, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకుంది. ఆరేళ్ల క్రితమే మెగా పవర్ స్టార్ తో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ మరోసారి అతనితో కలిసి యాక్ట్ చేసే అవకాశం దక్కించుకుంది. యస్. ఈ క్యూటీ మరెవరో కాదు గేమ్ ఛేంజర్ హీరోయిన్ కియారా అద్వానీ. సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోన్న నేపథ్యంలో ఈ సొగసరికి సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న కియారా అద్వానీ మహేశ్ బాబు భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. మొదటి సినిమాతోనే పక్కింటమ్మాయిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ మూవీలోనూ యాక్ట్ చేసింది. ఈ చిత్రం నిరాశపర్చినా చెర్రీ, కియారాల జోడికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మళ్ల గేమ్ ఛేంజర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిందీ అందాల తార. ఇందులో చెర్రీ ప్రియురాలు దీపిక పాత్రలో అమ్మడి అభినయానికి మంచి మార్కులు పడ్డాయి.\

ఇవి కూడా చదవండి

గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ..

 

ఇక కియారా అద్వానీ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి వివాహం చేసుకుంది. 2023 ఫిబ్రవరిలో రాజస్థాన్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.