Tollywood: ఈ క్యూట్ బ్రదర్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఫేమస్ హీరోస్.. ఎవరో గుర్తు పట్టారా?

అప్పుడప్పుడు మన సినిమా సెలబ్రిటీలు వాళ్ల చిన్నప్పటి లేదా త్రో బ్యాక్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. అలా తాజాగా ఓ టాలీవుడ్ హీరో తమ చిన్నప్పటి ఫోటోలు షేర్ చేసాడు. దీంతో ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

Tollywood: ఈ క్యూట్ బ్రదర్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఫేమస్ హీరోస్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actors

Updated on: Feb 24, 2026 | 9:55 AM

చిరంజీవి- పవన్ కల్యాణ్, బాలకృష్ణ- హరికృష్ణ, ఎన్టీఆర్- కల్యాణ్ రామ్, మహేష్ బాబు- రమేష్ బాబు, అల్లు అర్జున్- అల్లు శిరీష్, నాగ చైతన్య- అఖిల్, సాయి ధరమ్ తేజ్- వైష్ణవ్ తేజ్, మంచు విష్ణు- మంచు మనోజ్, ఆర్యన్ రాజేష్- అల్లరి నరేష్, విజయ్ దేవరకొండ- ఆనంద్ దేవరకొండ.. ఇలా తెలుగు సినిమా చరిత్రలో అన్నదమ్ములైన హీరోలు చాలా మందే ఉన్నారు. పై ఫొటోలో ఉన్న బ్రదర్స్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతారు. తండ్రి, బాబాయ్ ఇద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే. కావును వీరు కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత హీరోలుగానూ మారారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సత్తా చాటుతున్నారు. ఇద్దరూ యూత్ ఫుల్ స్టోరీలు, ప్రేమకథా చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. ఇందులో ఒక హీరో నటించిన సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనసును తడిపే ప్రేమ కథగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. దీంతో మరోసారి వీరిద్దరు పేర్లు ఇప్పుడు తెగ మార్మోగిపోతున్నాయి.

పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు… సంతోష్ శోభన్, సంగీత్ శోభన్. ప్రభాస్ వర్షం సినిమా డైరెక్టర్ శోభన్ కొడుకులైన వీరిద్దరు చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. గోల్కొండ హై స్కూల్ సినిమాలో తమ దైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు వీరు హీరోలుగానూ సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా తమ్ముడు సంగీత్ శోభన కు ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, 3 రోజెస్, ఒక చిన్న ఫ్యామిలీ కథ.. ఇలా వరుసగా సినిమాలు, సిరీస్ లతో హిట్స్ కొడుతున్నాడీ యంగ్ హీరో. త్వరలోనే రాకాస అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇవి కూడా చదవండి

సంగీత్ శోభన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

ఇక సంతోష్ శోభన్ చాలా రోజుల తర్వాత కపుల్ ఫ్రెండ్లీ సినిమా రూపంలో ఓ మంచి హిట్ అందుకున్నాడు. ఇటీవలే రిలీజైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ క్రమంలో చాన్నాళ్ల తర్వాత అన్నయ్య సంతోష్ శోభన్ హిట్ కొట్టడంతో చిన్నప్పుడు తమ తల్లితో దిగిన ఫొటోలు షేర్ చేసి స్పెషల్ పోస్ట్ చేసాడు సంగీత్. ‘మనలో ప్రతి శుక్రవారం ఎవరికో ఒకరికి రాసిపెట్టి ఉంటుంది. ఈ శుక్రవారం నీది. నీ బట్టలు వేసుకొని ఎపుడూ నీకు సపోర్ట్ గా ఉంటాను. జీవితం చివరి వరకు నీతోనే ఉంటాను’ అని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us