Tollywood: ఎంత క్యూట్‌గున్నారో! ఈ అన్నాచెల్లెళ్లను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో ఫేమస్ హీరో, హీరోయిన్లు

ఈ అన్నాచెల్లెళ్లు ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలోనే స్థిర పడ్డారు. హీరో, హీరోయిన్లుగా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా చెల్లెలు మల్టీట్యాలెంటెడ్ అమ్మాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె కేవలం యాక్టరే కాదు.. హోస్ట్ కూడా.. అలాగే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కూడా..

Tollywood: ఎంత క్యూట్‌గున్నారో! ఈ అన్నాచెల్లెళ్లను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో ఫేమస్ హీరో, హీరోయిన్లు
Varun Tej, Niharika Konidela

Updated on: Jan 19, 2026 | 6:38 PM

ఈ మధ్యన సినిమా తారల చిన్ననాటి ఫొటోలు, త్రో బ్యాక్ ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతోన్న సంగతి తెలిసిందే. ఇక సినిమా సెలబ్రిటీలు కూడా తమ పుట్టిన రోజు లేదా ఇతర సందర్భాల్లో తమ ఛైల్డ్ హుడ్ ఫొటోస్ ను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.నెటిజన్లు కూడా ఈ త్రో బ్యాక్ ఫొటోలను చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో, హీరోయిన్లు తమ చిన్ననాటి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .
మరి పై ఫొటోలో క్యూట్‌ గా కనిపిస్తున్న ఆ కిడ్స్ ఎవరో మీరు గుర్తుపట్టారా? సైకిల్ రైడ్ చేస్తున్న ఈ పిల్లలు స్టార్ కిడ్స్ కావడం గమనార్హం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ కుటుంబానికి చాలా పెద్ద నేపథ్యం ఉంది. ఈ ఫ్యామిలీ నుంచే దాదాపు 10 మందికి పైగా హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. అలా వీరు కూడా హీరో, హీరోయిన్లుగా సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. తమ యాక్టింగ్ ట్యాలెంట్ తో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు మెగా బ్రదర్ నాగ బాబు పిల్లలు వరుణ్ తేజ్, నిహారిక కొణిదెల. సోమవారం (జనవరి 19) వరుణ్ తేజ్ పుట్టినరోజు కావడంతో నిహారిక తన అన్నయ్యకు బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందులో చిన్నప్పుడు తన అన్నయ్యతో గడిపిన మధుర క్షణాలను ఫొటోల రూపం లో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ కొడుకు వాయువ్ తేజ్ ను తన హృదయానికి హత్తుకొని ప్రేమగా లాలిస్తున్న ఫొటో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

నిహారిక షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్.,

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కొరియన్ కనగరాజు అనే సినిమాలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మిరాయ్ ఫేమ్ రితికా నాయర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.