పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతను ఇప్పుడు పాన్ ఇండియా హీరో. ఒక టీవీ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ పోషించాడు. క్రమంగా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా అవకాశాలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు తన నటనా ప్రతిభతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇటీవల అతను నటించిన సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్లు దాటేసింది. దీంతో ప్రస్తుతం ఆ స్టార్ హీరో పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. మరి పైన ఉన్న హీరో ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్. అతను మరెవరో కాదు అమరన్ సినిమాతో సినీ ప్రేక్షకులను అలరిస్తోన్న శివ కార్తికేయన్. ఇది అతని పెళ్లి నాటి ఫొటో. శివ కార్తికేయన్ పక్కనున్నది అతని భార్య ఆర్తి. వీరి వివాహం 2010లోనే జరిగింది. ఇప్పుడీ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కాగా పెళ్లినాటికి ఇంకా నటుడిగా స్థిరపడలేదు శివ కార్తికేయన్. తమిళనాడులో పుట్టిపెరిగిన శివకార్తికేయన్‌కి చిన్నప్పటి నుంచే నటన అంటే చాలా ఇష్టం. కానీ పూర్తిస్థాయి నటుడు కావడానికి ముందే ఆర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నటన మీద ఆసక్తి ఉండడంతో ఓసారి అతని స్నేహితులు టీవీ షోకు తీసుకెళ్లారు. అక్కడ సత్తా చాటడంతో యాంకర్ గా కెరీర్ ప్రారంభించాడు శివ కార్తికేయన్. పలు టీవీషోలకు హోస్ట్ గానూ వ్యవహరించాడు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించాడు. ఇక 3 సినిమాల ధనుష్ కి స్నేహితుడిగానూ యాక్ట్ చేశాడు.
I’m extremely happy with the appreciation from Superstar @rajinikanth sir for #Amaran. Sitting with him as he admired every nuance of the film was truly unforgettable for me and the team. Thank you Thalaiva for your constant support and encouragement! 🙏❤️ pic.twitter.com/ZnVTRa2CfP
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) November 2, 2024
ఈ క్రమంలోనే 2013లో విడుదలైన ‘కేడీ బిల్లా కిలాడీ రంగ’ మూవీతో హీరోగా మారిపోయాడు శివ కార్తికేయన్. ఇది అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అతను హీరోగా నటించిన ‘డాక్టర్’ సినిమా ఏకంగా రూ.100 కోట్టు రాబట్టింది. వీటి తర్వాత అయలాన్, మహావీరుడు, డాన్ తదితర చిత్రాలతో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక దీపావళికి అమరన్ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.
நண்பர் கலைஞானி @ikamalhaasan அவர்களது அன்பு அழைப்பை ஏற்று, நேற்று #அமரன் திரைப்படம் பார்த்தேன்.
புத்தகங்களைப் போல் – திரைப்பட வடிவிலும் உண்மைக் கதைகளை இன்றைய இளைஞர்களிடம் கொண்டு சேர்ப்பது மகிழ்ச்சியளிக்கிறது!
தமிழ்நாட்டைச் சேர்ந்த இராணுவ வீரர் மேஜர் முகுந்த் வரதராஜன் அவர்களது… pic.twitter.com/ivp6OrHufb
— M.K.Stalin (@mkstalin) October 31, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.