AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? టాలీవుడ్ లవర్ బాయ్.. పేరు వింటే ‘అయ్యో పాపం’ అని జాలిపడతారు

టాలీవుడ్ లో అనతి కాలంలోనే ఎవరూ ఊహించని క్రేజ్, పాపులారిటీని సొంతం చేసుకున్నాడీ హీరో. వరుసగా ప్రేమకథా చిత్రాలు చేస్తూ లవర్ బాయ్ ట్యాగ్ సొంతం చేసుకున్నాడు. ఇతని పాపులారిటీని చూసి భవిష్యత్ లో స్టార్ హీరో రేంజ్ కు ఎదుగుతాడనుకున్నారు చాలా మంది.. కానీ..

Tollywood: ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? టాలీవుడ్ లవర్ బాయ్.. పేరు వింటే 'అయ్యో పాపం' అని జాలిపడతారు
Tollywood Actor
Basha Shek
|

Updated on: Jun 18, 2026 | 6:59 PM

Share

పై ఫొటోలో సర్కిల్ లో కనిపిస్తోన్న పిల్లాడిని గుర్తు పట్టారా?ఈ చిన్నోడు ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనతి కాలంలోనే ఎవరూ ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ముఖ్యంగా వరుసగా ప్రేమకథా చిత్రాలు చేస్తూ యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే లవర్ బాయ్ ఇమేజ్ కూడా తెచ్చుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఇతని క్రేజ్, పాపులారిటీని చూసి భవిష్యత్ లో స్టార్ హీరో రేంజ్ కు ఎదుగుతాడనుకున్నారు చాలా మంది.. కానీ కాలం ఆ హీరో రాతను మరోలా రాసింది. ఇతని పేరు వింటేనే అందరూ ‘అయ్యో పాపం’ అని జాలి చూపిస్తారు. కొందరైతే ఎమోషనల్ కూడా అవుతారు. 33 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి తెలుగు ఆడియెన్స్ కు తీరని విషాదాన్ని మిగిల్చిన ఆ హీరో మరెవరో కాదు ఉదయ్ కిరణ్. పై ఫొటోలో తన పక్కన ఉన్నది తన తల్లిదండ్రులు, సోదరి.

తేజ దర్శకత్వంలో చిత్రం సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఉదయ్ కిరణ్. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత మరోసారి తేజ దర్శకత్వంలో నువ్వు నేను అనే సినిమా చేసి ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతోనే యూత్ లో ఉదయ్ కిరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మనసంతా నువ్వే, కలుసుకోవాలని, హోలీ, నీ స్నేహం, నీకు నేను నాకు నువ్వు, లవ్ టుడే, ఔనన్నా కాదన్నా, గుండె ఝల్లుమంది.. ఇలా ఎన్నో సూపర్ హిట్ ప్రేమకథా చిత్రాలు ఉదయ్ కిరణ్ కెరీర్ లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

అయితే చాలామంది హీరోల్లాగానే ఉదయ్ కిరణ్ కు కూడా వరుస ఫ్లాపులు పడ్డాయి. చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. అప్పట్లో ఈ హీరో పరిస్థితిని చూసి చాలా మంది అతను కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. దీంతో క్షణికావేశంలో కఠిన నిర్ణయం తీసుకున్నాడు ఉదయ్ కిరణ్. 33 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకుని తన కుటుంబ సభ్యులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర విషాదంలో ముంచాడు. 2014 జనవరి 05న ఉదయ్ కిరణ్ కన్నుమూశాడు. అంటే ఈ హీరో చనిపోయి దాదాపు 12 ఏళ్లు గడిచాయి. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట ఈ హీరో పేరు వినిపిస్తుంటుంది.

Uday Kiran

Uday Kiran

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us