
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే భారీ స్టార్ క్యాస్టింగ్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఉప్పెన సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, కమెడియన్ సత్య తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ మెగా మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, గ్లింప్స్ , సాంగ్ కు అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చికిరీ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. వందల మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్లిపోతోంది. ఇప్పటికే ఈ పాట అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ల మార్క్ అందుకుంది. ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ తెరకెక్కుతోంది. ఇటీవలే ఢిల్లీలో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీ కరించారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అయ్యాయి.
కాగా వచ్చే ఏడాది వేసవిలో పెద్ది సినిమాను రిలీజ్ చేయనున్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా మార్చి 27న ఈ మెగా మూవీని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో సినిమా ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది చిత్ర బృందం. తాజాగా పెద్ది సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో నటిస్తోన్న ఓ టాలీవుడ్ స్టార్ నటుడి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఎందుకంటే ఈ ఫొటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టడం కొంచెం కష్టమే.
ఒకప్పుడు టాలీవుడ్ లో హ్యాండ్సమ్ హీరోగా చేశాడు. ఇప్పుడు విలన్ గానూ, సహాయక నటుడిగానూ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న ఆ నటుడు మరెవరో కాదు జగపతి బాబు. ఇందులో ఆయన అప్పలసూరి అనే పాత్రలో కనిపించనున్నారని పెద్ది చిత్ర బృందం ప్రకటించింది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన జగ్గూ భాయ్ ఇందులో పాజిటివ్ రోల్ లో నటిస్తున్నాడా? లేదా నెగిటివ్ క్యారెక్టరా అన్నది సినిమా రిలీజ్ అయితే తప్ప క్లారిటీ రాదు.
Honoured and super glad to be ‘APPALASOORI’ in #Peddi ❤🔥
Thoroughly enjoyed playing this role.
#PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/fYmuVeeTxc
— Jaggu Bhai (@IamJagguBhai) December 29, 2025
Amma puttina roju naadu parnasaalaki velli thittulu thini vastha… pic.twitter.com/nDrl5F7X6v
— Jaggu Bhai (@IamJagguBhai) November 5, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.