ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల కొంతమంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అక్క, వదినా, అమ్మ వంటి పాత్రల్లో నటిస్తున్నారు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే అప్పటి హీరోయిన్లను ఇప్పుడు గుర్తుపట్టడం కాస్త కష్టంగానే ఉంటుంది. గుర్తుపట్టలేని విధంగా ఉంటారు. పైన కనిపిస్తున్న ఫోటోలో హీరోయిన్ కూడా ఇదే కెటగిరీ. ఈ అమ్మడు ఒకప్పుడు స్టార్ హీరోలతో సరసన నటించింది. ఆ చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి.. ఇంతకీ ఎవరో గుర్తుపట్టండి.
ఈ అమ్మడు.. అక్కినేని నాగార్జున సరసన నటించిన సంతోషం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే హిందీలో అమీర్ ఖాన్ సరసన లగాన్ మూవీలోనూ కనిపిచించింది. అలాగై డైలాగ్ కింగ్ మోహన్ బాబు, శ్రీకాంత్ కలిసి నటించిన తప్పు చేసి పప్పు కూడు చిత్రంలోనూ కనిపించింది.
ఆమె హీరోయిన్ ఎవరో మరెవరో కాదు. ఒకప్పటి హీరోయిన్ గ్రేసి సింగ్. తెలుగుతోపాటు హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం గ్రేసీ సింగ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.