Tollywood: నృత్యంలో మయూరం.. ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇప్పటికీ సింగిలే.. ఎవరో గుర్తుపట్టగలరా ?..

|

Mar 17, 2024 | 11:04 AM

ఆ ఫోటో తాలుకూ జ్ఞాపకాలను తెలుసుకోవడానికి అభిమానులు.. సినీ ప్రియులు ఇప్పుడు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరం తారలు కాకుండా 80, 90'sలో సినీ పరిశ్రమలో అగ్ర నటీనటులుగా ఓ వెలుగు వెలిగిన సెలబ్రెటీల అరుదైన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. పైన ఫోటోను చూశారా కదా.. ఆ చిన్నారి కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఓ వెలుగు వెలిగింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి స్టార్ హీరోల సరసన ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అలరించారు.

Tollywood: నృత్యంలో మయూరం.. ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇప్పటికీ సింగిలే.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
Actrss
Follow us on

సోషల్ మీడియాలో నెటిజన్స్ ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నాయి త్రోబ్యాక్ ఫోటోస్. సినీ తారల చిన్ననాటి ఫోటోస్.. అరుదైన పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఆ ఫోటో తాలుకూ జ్ఞాపకాలను తెలుసుకోవడానికి అభిమానులు.. సినీ ప్రియులు ఇప్పుడు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరం తారలు కాకుండా 80, 90’sలో సినీ పరిశ్రమలో అగ్ర నటీనటులుగా ఓ వెలుగు వెలిగిన సెలబ్రెటీల అరుదైన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. పైన ఫోటోను చూశారా కదా.. ఆ చిన్నారి కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఓ వెలుగు వెలిగింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి స్టార్ హీరోల సరసన ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అలరించారు. ప్రస్తుతం ఆమె వయసు 53 సంవత్సరాలు. ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తుంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆ హీరోయిన్.. ఇప్పుడు శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే సీనియర్ హీరోయిన్ శోభన.

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె ఒకప్పుడు టాప్ హీరోయిన్. 1985లో అక్కినేని నాగార్జున నటించిన విక్రమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వ గోపాలుడు, నారీ నారీ నడుమ మురారి, వెంకటేష్, మోహన్ బాబు, రజినీకాంత్ తో అనేక చిత్రాల్లో నటించింది. 1980లో భారతదేశంలో కళాకారిణులలో ఆమె ఒకరు. అందంలోనూ.. నటనలోనే కాకుండా నాట్యంలోనూ అద్భుతమైన ప్రదర్శనతో కట్టిపడేస్తుంది. 1994లో విడుదలైన మణిచిత్రతళు సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది. ఆ త్రవాత 2001లో రిలీజ్ అయిన మిత్ర్ మై ఫ్రెండ్ సినిమాకు రెండో సారి జాతీయ అవార్డ్ అందుకుంది.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో ఎన్నో చిత్రాల్లో నటించిన శోభన.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. చెన్నైలో సొంతం నాట్య శిక్షణ శిభిరం ఏర్పాటు చేసి ఎంతో మంది యువతీయువకులకు నాట్యం నేర్పిస్తుంది. అంతేకాకుండా అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం డాన్స్ వీడియోస్ షేర్ చేస్తుంటారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.