- Telugu News Photo Gallery Cinema photos Sara Tendulkar stunning looks in green colour followrs dress telugu movie news
Sara Tendulkar: బ్రహ్మ సృష్టిలో ఎనిమిదో అద్భుతం ఉంటె.. ఈ వయ్యారిలనే ఉంటుందేమో.. సచిన్ కూతురు సారా టెండుల్కర్ బ్యూటీఫుల్ ఫోటోస్..
కొన్నాళ్లుగా సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇటీవల కొద్ది రోజులుగా వరుస ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట అందాల మాయ చేస్తుంది ఈ బ్యూటీఫుల్ ఏంజిల్. తాజాగా గ్రీన్ కలర్ పువ్వుల ట్రెండీ డ్రెస్లో మరింత అందంగా మెరిసిపోయింది సారా. సీతాకోక చిలుకలా.. పురివిప్పిన నెమలిలా ఎంతో సుందరంగా కనిపిస్తుంది ఈ సోయగాల సుందరి.
Updated on: Mar 17, 2024 | 11:39 AM

కొన్నాళ్లుగా సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇటీవల కొద్ది రోజులుగా వరుస ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట అందాల మాయ చేస్తుంది ఈ బ్యూటీఫుల్ ఏంజిల్.

తాజాగా గ్రీన్ కలర్ పువ్వుల ట్రెండీ డ్రెస్లో మరింత అందంగా మెరిసిపోయింది సారా. సీతాకోక చిలుకలా.. పురివిప్పిన నెమలిలా ఎంతో సుందరంగా కనిపిస్తుంది ఈ సోయగాల సుందరి. ప్రస్తుతం సారా లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి.

సారాకు ఇన్ స్టాలో 60 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఇన్ స్టాలో ఆమె షేర్ చేసిన గ్లామర్ ఫోటోలకు లక్షల్లో లైక్స్ వస్తుంటాయి. ఎప్పుడూ కూల్ గా కనిపిస్తూ మంత్రముగ్దులను చేస్తున్న సారా... త్వరలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉందంటున్నారు నెటిజన్స్.

1997 అక్టోబర్ 12న జన్మించింది సారా. ప్రస్తుతం ఆమె వయసు 26 సంవత్సరాలు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న సారా.. ఇప్పుడు వరుస ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ఆమె వ్యక్తిగత విషయాలు నిత్యం నెట్టింట హల్చల్ అవుతుంటాయి.

క్రికెటర్ శుభమన్ గిల్ తో సారా ప్రేమలో ఉందంటూ రూమర్స్ వైరలవుతుంటాయి. వీరిద్దరు కలిసి అనేకసార్లు రెస్టారెంట్స్, ఈవెంట్లలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే తమ గురించి వస్తున్న వార్తలపై వీరిద్దరు ఇప్పటివరకు స్పందించలేదు.




