సోషల్ మీడియాలో సినీతారలు చిన్న అప్డేట్ పంచుకున్న క్షణాల్లో వైరలవుతుంటాయి. ఇక స్టార్ హీరోహీరోయిన్స్ పర్సనల్ విషయాల గురించి చెప్పక్కర్లేదు. నిత్యం ఏదో ఒక రూమర్ నెట్టింట హల్చల్ చేస్తుంటుంది. అయితే చాలా మంది సెలబ్రెటీస్ తమ గురించి వచ్చే రూమర్స్ అంతగా పట్టించుకోకపోయినా.. మరికొద్ది మాత్రం గట్టిగానే కౌంటరిస్తుంటారు. అయితే కొద్ది కాలంగా త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నెట్టింట చేస్తోన్న సెన్సేషన్ గురించి తెలిసిందే. టాలీవుడ్ టూ బాలీవుడ్ తారల చిన్ననాటి ఫోటోస్ వైరలవుతుండగా.. ఇప్పుడు క్రేజీ పిక్స్ సైతం హల్చల్ చేస్తున్నాయి. పైన ఫోటోను చూశారు కదా.. అందులో ఉన్న హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. చిన్న వయసులోనే సౌత్ ఇండస్ట్రీలో కథానాయికగా రాణిస్తోంది. ఎవరో గుర్తుపట్టండి.
‘లవ్ టుడే’ అంటూ అడియన్స్ ముందుకు వచ్చి సౌత్ యూత్‌కు ఆకట్టుకుంది. గుర్తుపట్టరా ?. తనే హీరోయిన్ ఇవానా. డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో కథానాయికగా ఇవానా నటించింది. ఈ సినిమాతోనే వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది. తొలి చిత్రానికే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఇవానాకు ఫాలోయింగ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. తమిళంలో హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో ఇటు తెలుగులోనూ ఇవానాకు ఫాలోయింగ్ వచ్చేసింది.
ఈ సినిమా తర్వాత ఇవానాకు తమిళంలో మరిన్ని అవకాశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు 2.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కొద్దిరోజులుగా దుబాయ్ వెకేషన్ లో సందడి చేస్తుంది ఇవానా. అక్కడి ఏడారిలో ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.