Tollywood: ఈ చిన్నది ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. అమ్మగా ప్రమోషన్ పొందింది..

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది కథానాయికలు అందం, అభినయంతో మెప్పించి అడియన్స్ హృదయాలను దొచేసుకున్నారు. మొదటి చిత్రానికే ఎక్కువ పాపులారిటి సంపాదించుకుని.. అగ్ర హీరోల సరసన నటించి స్టార్ డమ్ అందుకున్నారు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఫ్యామిలీతో గడిపేస్తున్నారు. పైన ఫోటోలో కనిపిస్తోన్న ఆ చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించింది. ఎవరో గుర్తుపట్టారా ?.

Tollywood: ఈ చిన్నది ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. అమ్మగా ప్రమోషన్ పొందింది..
Actress

Updated on: Sep 16, 2023 | 10:25 AM

అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుని.. అంతలోనే ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది కథానాయికలు అందం, అభినయంతో మెప్పించి అడియన్స్ హృదయాలను దొచేసుకున్నారు. మొదటి చిత్రానికే ఎక్కువ పాపులారిటి సంపాదించుకుని.. అగ్ర హీరోల సరసన నటించి స్టార్ డమ్ అందుకున్నారు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఫ్యామిలీతో గడిపేస్తున్నారు. పైన ఫోటోలో కనిపిస్తోన్న ఆ చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించింది. ఎవరో గుర్తుపట్టారా ?. ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందింది.తనే హీరోయిన్ ఇలియానా.

2006లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటింటిన దేవదాసు సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుని స్టార్ డమ్ సంపాదించుకుంది. తొలి చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు జోడిగా పోకిరి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ఈ బ్యూటీకి అటు తమిళంలోనూ వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అలరించిన ఇలియానా.. 2012లో బర్ఫీ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా సక్సెస్‌తో బాలీవుడ్‌లోనూ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది ఇలియానా. ఆ తర్వాత షాహిద్ కపూర్‌తో కలిసి ‘ఫాటా పోస్టర్ నిక్లా హీరో’లో కనిపించింది.

సౌత్‌లో, బాలీవుడ్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఇలియానాకు పోర్చుగల్ పౌరసత్వం ఉంది. కానీ చిన్నప్పటి నుంచి గోవాలోనే నివాసముంది. 12-13 ఏళ్ల వయసులో సన్నగా ఉండటం వల్లే బాడీ షేమింగ్‌కు గురయ్యానని ఇలియానా గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇటీవలే పండింటి బాబుకు జన్మనిచ్చింది ఇలియానా. తన కొడుకుకు ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టినట్లుగా ప్రకటించింది. కానీ తన జీవిత భాగస్వామి ఎవరనేది మాత్రం వెల్లడించలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.