Tollywood: వార్నీ.. ఈ చిన్నోడు ఇప్పుడు సెన్సెషన్ హీరోయిన్.. ఒక్క సినిమాతో కెరీర్ మారిపోయింది..

సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ ట్రెండ్ కావడం కామన్. అందుకే ఇప్పుడు మీకోసం స్టార్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫిక్ తీసుకువచ్చాం. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నోడు ఇప్పుడు సెన్సెషన్ హీరోయిన్. ఒక్క సినిమాతోనే ఆ బ్యూటీ క్రేజ్ మారిపోయింది. ఇప్పుడు యూత్ గుండెల్లో ఆరాధ్య దేవత. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Tollywood: వార్నీ.. ఈ చిన్నోడు ఇప్పుడు సెన్సెషన్ హీరోయిన్.. ఒక్క సినిమాతో కెరీర్ మారిపోయింది..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 02, 2024 | 7:18 PM

సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ ట్రెండ్ కావడం కామన్. అందుకే ఇప్పుడు మీకోసం స్టార్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫిక్ తీసుకువచ్చాం. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నోడు ఇప్పుడు సెన్సెషన్ హీరోయిన్. ఒక్క సినిమాతోనే ఆ బ్యూటీ క్రేజ్ మారిపోయింది. ఇప్పుడు యూత్ గుండెల్లో ఆరాధ్య దేవత. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఓ మూవీలో కీలకపాత్ర పోషించి.. మెయిన్ హీరోయిన్ కంటే ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు ఆ బ్యూటీకి ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ త్రిప్తి డిమ్రి. ఫిబ్రవరి 23, 1995న జన్మించిన త్రిప్తి.. హిందీలో శ్రేయాస్ తల్పాడే దర్శకత్వం వహించిన పోస్టర్ బాయ్స్ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో సన్నీ డియోల్, బాబీ డియోల్, తల్పాడే ప్రధాన పాత్రలు పోషించారు.

ఆ తర్వాత 2018లో అవినాష్ తివారీతో కలిసి ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన లైలా మజ్నులో ప్రధాన పాత్రలో కనిపించింది. ఈ మూవీతో కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే అన్వితా దత్ దర్శకత్వం వహించిన బుల్బుల్ చిత్రంలో తన నటనకు సినీ క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. 2022లో విమర్శకుల ప్రశంసలు పొందిన ఖలా టైటిల్ రోల్‌లో నటించింది. ఇక గతేడాది విడుదలైన యానిమల్ మూవీ ఆమె కెరీర్ ను టర్న్ చేసింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్, రష్మిక కలిసి నటించిన యానిమల్ మూవీలో ముఖ్య పాత్ర పోషించింది.

ఈ సినిమాలో త్రిప్తి కనిపించింది కాసేపు అయినప్పటికీ ఊహించని రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇందులో జోయా పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది. యానిమల్ తర్వాత హిందీలో త్రిప్తికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవలే బ్యాడ్ న్యూజ్ సినిమాతో మరో సక్సెస్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం విక్కీ విద్యా కా వహ్ వాలా చిత్రంలో నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే