Sridevi: శ్రీదేవితో ఉన్న ఈ చిన్నారులు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్.. అందరు చిరు సరనస నటించినవాళ్లే..

|

Feb 28, 2024 | 9:05 AM

తాజాగా శ్రీదేవికి సంబంధించిన ఓ రేర్ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో ఆమె పక్కన ముగ్గురు అమ్మాయిలు కూర్చున్నారు. వారంతా సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్స్. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోయిన అక్కాచెల్లెళ్లు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరో గుర్తుపట్టగలరా ?.. ఆ ముగ్గురు అక్కాచెల్లెల్లు మెగాస్టార్ చిరంజీవి జోడిగా నటించినవారే. ఇంతకీ వాళ్లెవరో తెలుసా ?.

Sridevi: శ్రీదేవితో ఉన్న ఈ చిన్నారులు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్.. అందరు చిరు సరనస నటించినవాళ్లే..
Sridevi
Follow us on

పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికలలో శ్రీదేవి ఒకరు. అప్పట్లో చిత్రపరిశ్రమలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న తార కూడా ఆమెనే. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆపై కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. 2018 ఫిబ్రవరి 24న 54 ఏళ్ల వయసులోనే అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. శ్రీదేవి మరణం సినీ పరిశ్రమకు ఎప్పటికీ తీరని లోటును మిగిల్చింది. ఇప్పటికీ ఆమె జ్ఞాపకాలను పంచుకుంటున్నారు సినీ ప్రముఖులు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీదేవికి సంబంధించిన ఓ రేర్ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో ఆమె పక్కన ముగ్గురు అమ్మాయిలు కూర్చున్నారు. వారంతా సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్స్. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోయిన అక్కాచెల్లెళ్లు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరో గుర్తుపట్టగలరా ?.. ఆ ముగ్గురు అక్కాచెల్లెల్లు మెగాస్టార్ చిరంజీవి జోడిగా నటించినవారే. ఇంతకీ వాళ్లెవరో తెలుసా ?. సీనియర్ హీరోయిన్స్ నగ్మా, జ్యోతిక, రోషిణి..

శ్రీదేవి కుడివైపు కూర్చున్న అమ్మాయి నగ్మా.. అలాగే ఆమెకు ఎడమవైపు కూర్చున్న అమ్మాయి జ్యోతిక. అలాగే తన పక్కన కూర్చున్న చిన్నారి రోషిణి. వీరంతా మెగాస్టా్ర్ చిరంజీవి సరసన నటించి అలరించారు. చిరంజీవి జోడిగా ఘరానా మొగుడు సినిమాలో నటించింది నగ్మా. ఆ తర్వాత రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు చిత్రాల్లో కలిసి నటించారు. నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఇక ఆ తర్వాత జ్యోతిక, చిరంజీవి కాంబోలో ఠాగూర్ సినిమా వచ్చింది. ఇక రోషిణి, చిరంజీవి జంటగా మాస్టర్ సినిమాలో నటించారు. మొత్తం ముగ్గురు అక్కాచెల్లెళ్లు మెగాస్టార్ చిరంజీవి జోడిగా నటించినవారే. ఇక శ్రీదేవి, చిరంజీవి కాంబోలో అనేక సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అందులో జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా ఒకటి. ఆ తర్వాత ఎస్పీ పరశురాం, కొండవీటి రాజా తదితర చిత్రాల్లో నటించింది.

నగ్మా డిసెంబర్ 25, 1974న అంటే క్రిస్మస్ రోజున జన్మించింది. ఆమె తల్లి ముస్లిం తండ్రి హిందూ. నగ్మా అసలు పేరు నందితా అరవింద్ మొరార్జీ. అతను సుప్రసిద్ధ వ్యాపారవేత్త. నగ్మా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తల్లి సినీ నిర్మాత చందర్ సదనను వివాహం చేసుకుంది. వీరికి జ్యోతిక, రోషిణి జన్మించారు. నగ్మా ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో సహా 50కి పైగా చిత్రాల్లో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.