Tollywood: ఈ చిన్నోడు టాలీవుడ్ క్రేజీ హీరో.. అమ్మాయిల ఫాలోయింగ్ మాములుగా ఉండదు..

|

Apr 05, 2024 | 8:58 PM

తండ్రి భూజాల పై ఉన్న ఆ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షలను అలరిస్తున్నాడు. అంతేకాదు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇంతకీ ఎవరో తెలుసా ?.

Tollywood: ఈ చిన్నోడు టాలీవుడ్ క్రేజీ హీరో.. అమ్మాయిల ఫాలోయింగ్ మాములుగా ఉండదు..
Actor
Follow us on

పైన ఫోటోలో తండ్రి భూజాల పై ఉన్న ఆ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షలను అలరిస్తున్నాడు. అంతేకాదు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇంతకీ ఎవరో తెలుసా ?.. తనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్ట్రర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీతో విజయ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో నటనపరంగా ప్రశంసలు అందుకున్నాడు. డియర్ కామ్రేడ్, టాక్సీవాలా సినిమాలతో అలరించాడు. గతేడాది ఖుషి సినిమాతో ఘన విజయం అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 5న గ్రాండ్ గా విడుదలైంది. ఇందులో విజయ్ జోడిగా మృణాల్ ఠాకూర్ నటించింది.

ఈ సినిమాకు ఉదయం నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలో తన ఫ్యామిలీ గురించి తల్లిదండ్రులు, తమ్ముడి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ కష్టాలు.. తన తండ్రి పడ్డ గురించి ఎప్పుడూ చెబుతుంటాడు. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లలో తన తండ్రి గురించి అనేకసార్లు చెప్పుకొచ్చాడు. తండ్రి పడ్డ కష్టం.. చేసిన త్యాగాలకు సరైన ప్రతిఫలం అందించాలని అనుకున్నట్లు తెలిపాడు. తాజాగా ఫ్యామిలీ స్టార్ రిలీజ్ సందర్భంగా మరోసారి తన తండ్రిపై ప్రేమను బయటపెట్టాడు.

తన తండ్రితో కలిసున్న ఫోటోలను వీడియోగా షేర్ చేస్తూ.. తమ ఫ్యామిలీకి ఆయనే స్టార్. నా హీరో. నా స్టార్ అని చెప్పుకొచ్చారు. తమ కోసం, కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశారని తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేసారు. ఎప్పుడైనా తప్పు చేసి ఉంటే.. మిమ్మల్ని తలదించుకునేలా చేసి ఉంటే క్షమించండి నాన్నా అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం తన తండ్రి అని రాసుకొచ్చారు. చిన్నప్పటి నుంచి తండ్రితో కలిసున్న ఫోటోలను పంచుకున్నాడు. ప్రస్తుతం విజయ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. విజయ్ తండ్రి పేరు గోవర్దన్ రావు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.