Tollywood: ఈ కుర్రాడు టాలీవుడ్ సింగర్.. అతడి గాత్రానికి ముగ్దులవ్వాల్సిందే.. ఎవరో తెలుసా..?

తల్లి పక్కన నిలుచుని అమాయకంగా కనిపిస్తున్న ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్ పాపులర్ సింగర్. అతడు పాట పాడితే మనసుకు ప్రశాంతంగా ఉండాల్సిందే. తన గాత్రానికి ఎవరైనా సరే మంత్రముగ్దులవ్వాల్సిందే. ఇప్పటివరకు తెలుగులో అనేక పాటలు పాడారు. నువ్విలా ఒకసారిలా అంటూ అతడు పాడిన సాంగ్ ఒకప్పుడు సంచలనం

Tollywood: ఈ కుర్రాడు టాలీవుడ్ సింగర్.. అతడి గాత్రానికి ముగ్దులవ్వాల్సిందే.. ఎవరో తెలుసా..?
Singer
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 13, 2024 | 3:27 PM

సోషల్ మీడియాలో ఇప్పుడు సెలబ్రెటీల చైల్డ్ హుడ్ ఫోటోస్, త్రోబ్యాక్ పిక్స్ తెగ వైరలవుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ సింగర్ చిన్ననాటి పిక్ నెట్టింట వైరలవుతుంది. తన తల్లితో కలిసి దిగిన ఫోటో చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. పైన ఫోటోను చూశారు కదా.. అందులో తన తల్లితో కలిసి ఉన్న ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా..? తల్లి పక్కన నిలుచుని అమాయకంగా కనిపిస్తున్న ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్ పాపులర్ సింగర్. అతడు పాట పాడితే మనసుకు ప్రశాంతంగా ఉండాల్సిందే. తన గాత్రానికి ఎవరైనా సరే మంత్రముగ్దులవ్వాల్సిందే. ఇప్పటివరకు తెలుగులో అనేక పాటలు పాడారు. నువ్విలా ఒకసారిలా అంటూ అతడు పాడిన సాంగ్ ఒకప్పుడు సంచలనం సృష్టించింది. సినిమాల్లోనే కాకుండా స్వరాభిషేకం వంటి రియాల్టీ షోలలోనూ సాంగ్స్ ఆలపించాడు. ఇంతకీ అతడు ఎవరు అనుకుంటున్నారా..? టాలీవుడ్ పాపులర్ సింగర్ కృష్ణ చైతన్య.

ఇటీవల తన తల్లి పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విషెస్ తెలుపుతూ తన చిన్ననాటి ఫోటో షేర్ చేశాడు. 2005లో టెన్త్ కాస్ల్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ సంగీత సారధ్యంలో ఓ పాట పాడారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ చేస్తూ పలు రియాల్టీ సింగింగ్ షోలో పాల్గొన్నారు. బృందావనం, ఓమై ఫ్రెండ్, పిల్ల జమీందార్, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, స్వామీరారా, బాద్ షా, ఎవడు, సరైనోడు ఇలా చాలా సినిమాల్లో పాటలు పాడారు. ఆ తర్వాత రౌడీ ఫెలో అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇందులో నారా రోహిత్ హీరోగా నటించారు. గాయకుడిగానే కాకుండా లిరిక్ రైటర్ గా అనేక పాటలు పాడారు.

2014లో ప్రముఖ యాంకర్ మృదులను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ బాబు ఉన్నాడు. ఓవైపు సింగర్ గా పాటలతో అలరిస్తున్న కృష్ణ చైతన్య.. ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం తన ఇన్ స్టాలో ఏదోక పోస్ట్ చేస్తుంటారు. అలాగే సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసి ఆసక్తికర విషయాలను పంచుకుంటారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.