Tollywood: శివాజీ గణేశన్ చేతిలో ఉన్న ఆ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఇండస్ట్రీలో చాలా స్పెషల్..

|

Oct 08, 2024 | 3:51 PM

వైవిధ్యమైన పాత్రలలో జీవించేస్తాడు. పైన ఫోటోలో అలనాటి దిగ్గజ నటుడు శివాజీ గణేశన్ చేతిలో ఉన్న ఆ కుర్రాడే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో. ఇప్పుడు ఈ చిన్నోడు సౌత్ ఇండస్ట్రీలోనే అగ్రకథానాయకుడు. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న బడా హీరోలలో ఆ కుర్రాడు కూడా ఒకరు. అయన నటనకు కళామతల్లి సైతం ముగ్దురాలు అవుతుంది. తనదైన నటనతో ప్రపంచాన్ని సైతం ఫిదా చేయగలడు.

Tollywood: శివాజీ గణేశన్ చేతిలో ఉన్న ఆ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఇండస్ట్రీలో చాలా స్పెషల్..
actor
Follow us on

సినీరంగంలో సాహాసలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఓ స్టార్ హీరో చిన్ననాటి ఫోటో ఇప్పుడు నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. యాక్షన్, ఫైట్ సీన్స్ తో సంబంధమే లేదు.. కథ నచ్చితే పాత్ర ఎలాంటిదైన ఓకే చేస్తాడు. వైవిధ్యమైన పాత్రలలో జీవించేస్తాడు. పైన ఫోటోలో అలనాటి దిగ్గజ నటుడు శివాజీ గణేశన్ చేతిలో ఉన్న ఆ కుర్రాడే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో. ఇప్పుడు ఈ చిన్నోడు సౌత్ ఇండస్ట్రీలోనే అగ్రకథానాయకుడు. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న బడా హీరోలలో ఆ కుర్రాడు కూడా ఒకరు. అయన నటనకు కళామతల్లి సైతం ముగ్దురాలు అవుతుంది. తనదైన నటనతో ప్రపంచాన్ని సైతం ఫిదా చేయగలడు.. ఇక హీరో అని కాకుండా సినిమా కోసం ఎంతటి సాహసం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు.. ప్రస్తుతం అతని వయసు 68 సంవత్సరాలు . అయినా వరుస చిత్రాలతో కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నాడు. ఎవరో గుర్తుపట్టండి. ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు.. మరెన్నో పురస్కారాలు ఉన్నాయి. ఈ స్టార్ హీరోకు భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. .అతడే లోకనాయకుడు కమల్ హాసన్.

నటనతో ప్రపంచాన్నే గెలిచే గొప్ప నటుడు. సినిమాలతో ఆయన చేసిన ప్రయోగాలు కొకొల్లలు. ఒకప్పుడు పదో తరగతి కూడా చదవని వ్యక్తి ఈరోజు ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగారు. 1954లో తమిళనాడులోని రామనాథ పురం జిల్లాలోని పరమక్కుడి ప్రాంతంలో జన్మించిన కమల్ హాసన్.. చిన్నప్పుడు సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి.. తన నటనతో మెప్పించాడు. అద్భుతమైన నటనకు మొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న హీరో కమల్. ఇక ఆ తర్వాత తన చిత్రాలు, యాక్టింగ్ తో జాతీయ ఉత్తమ నటుడిగా మూడుసార్లు అవార్డ్ అందుకున్నారు.

కేవలం నటుడిగానే కాదు. క్లాసికల్ డ్యాన్స్.. సంగీతంలోనూ ప్రతిభ ఉన్న హీరో కమల్ హాసన్. అక్కినేని నాగేశ్వరరావు నటించిన శ్రీమంతుడు చిత్రంతో డాన్స్ అసిస్టెంట్ గా పనిచేశారు కమల్. ఆ తర్వాత స్క్రీన్ ప్లే రాయడం పై ఆసక్తి పెంచుకున్నారు. అటు డాన్స్ కొరియోగ్రఫీ… ఇటు రైటింగ్ స్కిల్ ఉడండంతో ఇండస్ట్రీలో డైరెక్టర్ కావాలనుకున్నారట. కానీ.. డైరెక్టర్ కె. బాలచందర్ సూచించడంతో నటనవైపు అడుగులు వేసిన కమల్.. అరంగేట్రమ్ సినిమాతో కథానాయికుడిగా పరిచయమయ్యారు. వీరిద్దరి కాంబోలో దాదాపు 35కి పైగా సినిమాలు వచ్చాయి. ఆకలి రాజ్యం, భారతీయుడు, నాయకుడు, సాగర సంగమం, దశావతారం, విశ్వరూపం 2 సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.