
సోషల్ మీడియాలో చాలా రోజులుగా సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. త్రోబ్యాక్ ట్రెండ్ అంటూ తమ అభిమాన స్టార్స్ పర్సనల్ విషయాలు.. చైల్డ్ హుడ్ ఫోటోస్ చూసేందుకు నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. పైన ఫోటోను చూశారు కదా.. ఆ చిన్నోడు ఇప్పుడు పాన్ ఇండియాలోనే సూపర్ స్టార్. అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు. అంతేకాదు.. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో ఒకరు. ఇండస్ట్రీలో మకుటం లేని యువరాజు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అతడి ఆస్తుల విలువ దాదాపు రూ.2900 కోట్లు. ప్రస్తుతం ఈ హీరో వయసు 58 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటున్నాడు. అతడే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.
బాలీవుడ్ కింగ్ త్రయంలో ఒకరైన సల్మాన్ ఖాన్ క్రానిక్ బ్యాచిలర్‌గా కొనసాగుతున్నారు. సల్మాన్ నికర విలువ రూ.2,900. సల్మాన్ ఖాన్ 1988లో ‘బివి హో తో ఇసి’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. కానీ 1989లో రిలీజైన మైనే ప్యార్ కియా సినిమాలోనే తొలిసారి హీరోగా నటించాడు. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఈ మూవీ మ్యూజికల్ సెన్సెషన్. ఆ తర్వాత ఏక్ లడ్కా ఏక్ లడ్కీ, చంద్ర ముఖి, కుచ్ కుచ్ హోతా హై, దబాంగ్, ఏక్ థా టైగర్, హమ్ దిల్ దే చుకే సనమ్, తేరే నామ్, టైగర్ జిందా హై, బజరంగీ బైజాన్, సుల్తాన్, కిక్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, వంటి ఎన్నో హిట్‌లు అందుకున్నాడు.
సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ప్రముఖ రచయిత సలీం ఖాన్, సుశీలా చరక్‌ల పెద్ద కొడుకు. నటులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ అన్నదమ్ములు. సల్మాన్‌కు అల్విరా, అర్పిత అనే ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. సల్మాన్ ఖాన్ నటుడిగానే కాకుండా నిర్మాణ రంగంలో కూడా చురుగ్గా ఉంటాడు. ప్రముఖ హిందీ రియాల్టీ షో బిగ్ బాస్ కు సల్మాన్ హోస్ట్ కూడా వ్యవహరిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.