Tollywood: ఒకప్పుడు రెజ్లింగ్ ఛాంపియన్.. కట్ చేస్తే.. ఇప్పుడు కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తోన్న స్టార్..

|

Jun 28, 2024 | 1:01 PM

సినీ రంగంలోకి అడుగుపెట్టడానికి ముందు రెజ్లింగ్‌లో రాష్ట్ర ఛాంపియన్‌గా ఉన్నాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. హీరోయిజం చిత్రాలే కాకుండా కంటెంట్ నచ్చితే క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీగా ఉంటాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో తనయుడు మలయాళీ ఇండస్ట్రీలో హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా లవ్ స్టోరీ చిత్రాలతో హీరోగా దూసుకుపోతున్నాడు. ఇంతకీ మేము ఎవరి గురించి చెబుతున్నామో తెలుసా..

Tollywood: ఒకప్పుడు రెజ్లింగ్ ఛాంపియన్.. కట్ చేస్తే.. ఇప్పుడు కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తోన్న స్టార్..
Actor
Follow us on

భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. నిజానికి మలయాళీ హీరో అయినా ఇటు తెలుగు, తమిళంలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో అగ్ర నటుడిగా వెలుగొందుతున్నాడు. 64 ఏళ్ల వయసులోనూ హీరోగా వరుస విజయాలను అందుకుంటూ యంగ్ హీరోలకు పోటీనిస్తున్నాడు. కానీ అతడు సినీ రంగంలోకి అడుగుపెట్టడానికి ముందు రెజ్లింగ్‌లో రాష్ట్ర ఛాంపియన్‌గా ఉన్నాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. హీరోయిజం చిత్రాలే కాకుండా కంటెంట్ నచ్చితే క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీగా ఉంటాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో తనయుడు మలయాళీ ఇండస్ట్రీలో హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా లవ్ స్టోరీ చిత్రాలతో హీరోగా దూసుకుపోతున్నాడు. ఇంతకీ మేము ఎవరి గురించి చెబుతున్నామో తెలుసా.. అతడే మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్.

మోహన్‌లాల్ 1970లో తన తిరనోట్టం సినిమాతో భారతీయ చలనచిత్ర ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రాన్ని తన స్నేహితులతో కలిసి నిర్మించాడు. కానీ సెన్సార్ ఆలస్యం కావడంతో థియేటర్లలోనూ ఆలస్యంగా విడుదలైంది. కానీ ఈ సినిమా కంటే ముందే 1980లో మంజిల్ విరింజ పుక్కల్ అనే సినిమా రిలీజ్ అయ్యింది. వెండితెరపై విలన్‌గా అరంగేట్రం చేసిన మోహన్‌లాల్ తన లుక్స్‌తో చాలా మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. మలయాళంలో అనేక చిత్రాల్లో నటించిన మోహన్ లాల్ రెండుసార్లు ఉత్తమ నటుడితో సహా నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నాడు. మలయాళంతో పాటు తమిళం, హిందీ, తెలుగు, కన్నడ చిత్రాలలో నటించాడు.

విలన్ పాత్రలతో సినిమాల్లోకి అరంగేట్రం చేసిన మోహన్ లాల్ ఆ తర్వాత హీరోగా.. తర్వాత కమెడియన్ పాత్రలు పోషించారు. 80, 90’sలో సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో ఒకరిగా నిలిచారు. నాలుగు దశాబ్దాల కెరీర్ లో మోహన్ లాల్ దాదాపు రూ.350కి పైగా సినిమాల్లో నటించాడు. తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారెజ్ చిత్రంలో కీలకపాత్రలో కనిపించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.