Tollywood: టాలీవుడ్‍లో టాప్ కమెడియన్ ఈ చిన్నోడు.. కామెడీ టైమింగ్ మాములుగా ఉండదు..

వీరితోపాటు ఇప్పుడిప్పుడే నవతరం అడియన్స్ కు దగ్గరవుతున్న కమెడియన్స్ వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రియదర్శి, సప్తగిరి, రాహుల్ రామకృష్ణ, సత్య ఇండస్ట్రీలోకి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సినీ ప్రియులకు ఎంతో దగ్గరైన ఓ కమెడియన్ చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Tollywood: టాలీవుడ్‍లో టాప్ కమెడియన్ ఈ చిన్నోడు.. కామెడీ టైమింగ్ మాములుగా ఉండదు..
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 06, 2024 | 11:33 AM

తెలుగు సినీ పరిశ్రమలో తమ యాక్టింగ్‏తో నవ్వులు పండించే కమెడియన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన హాస్యనటులు బ్రహ్మనందం, ఆలీ, రఘుబాబు, ఎల్‌బి శ్రీరామ్, బాబు మోహన్. వీరితోపాటు ఇప్పుడిప్పుడే నవతరం అడియన్స్ కు దగ్గరవుతున్న కమెడియన్స్ వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రియదర్శి, సప్తగిరి, రాహుల్ రామకృష్ణ, సత్య ఇండస్ట్రీలోకి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సినీ ప్రియులకు ఎంతో దగ్గరైన ఓ కమెడియన్ చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నోడు స్క్రీన్‌పై కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు. యాక్టింగ్ మాత్రమే కాదు.. తన ముఖకవలికలతోనే నవ్వించడం ఇతడి స్టైల్. ఇక టైమింగ్ గురించి చెప్పక్కర్లేదు. అతడే వెన్నెల కిశోర్.

తాను నటించిన తొలి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. వెన్నెల సినిమాతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఫస్ట్ మూవీతోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తన మొదటి సినిమానే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో వెన్నెల కిశోర్ గా ఫేమస్ అయ్యాడు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి నటనతో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.

నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. డైరెక్టర్ దేవా కట్టా తెరకెక్కించిన వెన్నెల సినిమాతో అనుకోకుండా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.. ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి ఇండియాకు వచ్చి అవకాశాలు అందుకున్నాడు. ఇక వెన్నెల కిషోర్ యాక్టింగ్, కామెడీ టైమింగ్, ఎక్స్ ప్రెషన్స్ తోనే కిశోర్ నవ్వించడంతో అతడికి పెద్ద సినిమాల్లో వరుస ఆఫర్లు వచ్చాయి. ‘వెన్నెల 1 1/2’ అంటూ ఓ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు కిశోర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే