Tollywood : ఈ దసరాకు దుమ్మురేపే సినిమాలు ఇవే .. ఆడియన్స్ కు పండగే

|

Oct 08, 2024 | 9:03 AM

దేవర ఊపు కాస్త తగ్గడంతో ఇప్పుడు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే గోపీచంద్ హీరోగా నటిస్తున్న విశ్వం సినిమా కూడా రిలీజ్ కానుంది. గోపీచంద్ నటించిన ‘విశ్వం’ చిత్రం అక్టోబర్ 11న విడుదలవుతోంది. ఈ సినిమా తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉందని అందరూ అంటున్నారు.

Tollywood : ఈ దసరాకు దుమ్మురేపే సినిమాలు ఇవే .. ఆడియన్స్ కు పండగే
Movie News
Follow us on

పండగలు వస్తే సినిమా లవర్స్ రచ్చ రచ్చ చేయాల్సిందే.  చాలా సినిమాలు థియేటర్లలో విడుదలై సందడి చేస్తాయి. థియేటర్స్ జనాలతో నిండిపోతాయి. ఇక ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయి మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు దసరా వచ్చేసింది. ఈ దసరాకు కూడా కొన్ని క్రేజీ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. కన్నడ, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు విడుదలవుతున్నాయి. ఏ ఏ సినిమాలు విడుదలవుతున్నాయో ఓ లుక్కేద్దాం.!

టాలీవుడ్ లో నిన్నటివరకు దేవర హంగామా నడిచింది. ఎక్కడ చూసిన దేవర సినిమా సందడే కనిపిస్తుంది. ఇక ఇప్పుడు దేవర ఊపు కాస్త తగ్గడంతో ఇప్పుడు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే గోపీచంద్ హీరోగా నటిస్తున్న విశ్వం సినిమా కూడా రిలీజ్ కానుంది. గోపీచంద్ నటించిన ‘విశ్వం’ చిత్రం అక్టోబర్ 11న విడుదలవుతోంది. ఈ సినిమా తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉందని అందరూ అంటున్నారు. అదేవిధంగా సుధీర్ బాబు నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ కూడా అదే రోజు విడుదలవుతోంది.

సూపర్ స్టార్ తమిళ చిత్రం ‘వెట్టయన్’ అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు హిందీ నుంచి అమితాబ్ బచ్చన్, మాలీవుడ్‌ నుంచి ఫహద్ ఫాసిల్, తెలుగు నుంచి రానా నటిస్తున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ‘జైలర్’ సినిమాతో రజనీ పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాతో మరో హిట్ ఖాయం అంటున్నారు.

జిగ్రా.. హిందీలో రూపొందిన ఈ చిత్రంలో అలియా భట్ ప్రధాన  పాత్రలో నటిస్తోంది. అలియా భట్ ఈ సినిమా పై నమ్మకంతో ఉంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలియా భట్ బిడ్డ పుట్టిన తర్వాత అంగీకరించిన సినిమా ఇది. ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ తర్వాత ఈ సినిమా విడుదల కానుంది.

ధృవ సర్జా నటించిన ‘మార్టిన్’ చిత్రం అక్టోబర్ 11న విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. ఎపి అర్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉదయ్ మెహతా నిర్మించారు. కన్నడతో పాటు విదేశీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కన్నడతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కావడం విశేషం. ‘పొగరు’ తర్వాత ధృవ్‌ నటిస్తున్న సినిమా ఇదే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.