Pakka Commercial : సినిమా పై ఆసక్తి పెంచుతున్న “పక్కా క‌మ‌ర్షియ‌ల్” ఫస్ట్ గ్లిమ్ప్స్.. సోష‌ల్ మీడియాలో ట్రెండ్‌‌‌‌గా..

మ్యాచో హీరో గోపీచంద్ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన సీటీమార్ సినిమా పర్లేదు అనిపించుకుంది.

Pakka Commercial : సినిమా పై ఆసక్తి పెంచుతున్న పక్కా క‌మ‌ర్షియ‌ల్ ఫస్ట్ గ్లిమ్ప్స్.. సోష‌ల్ మీడియాలో ట్రెండ్‌‌‌‌గా..
Gopichand

Updated on: Nov 06, 2021 | 4:28 PM

Pakka Commercial : మ్యాచో హీరో గోపీచంద్ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన సీటీమార్ సినిమా పర్లేదు అనిపించుకుంది. దాంతో ఇప్పుడు ఈ టాల్ హీరో ఆశలన్నీ మారుతి సినిమా పైనే పెట్టుకున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్లు పై  గోపీచంద్, రాశీఖ‌న్నా జంట‌గా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ మూవీకి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. స‌క్సెస్ ఫుల్ నిర్మాత బ‌న్నీవాసు, స్టార్ డైరెక్ట‌ర్ మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గోపీచంద్ – మారుతి కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుంద‌ని ఎనౌన్స్ మెంట్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ టీజ‌ర్ పై అటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల‌తో పాటు ఇటు ఇండ‌స్ట్రీ ట్రేడ్ స‌ర్కిల్స్‌లో ఉత్కంఠ ఏర్ప‌డింది. ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ ఫ‌స్ట్ లుక్ తో పాటు చిత్ర బృందం విడుద‌ల చేసిన త‌దిత‌ర ప‌బ్లిసిటీ మెటీరియ‌ల్స్ కి క్రేజీ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా పక్కా క‌మ‌ర్షియ‌ల్ టీజ‌ర్ విడుదద‌లై సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దాదాపుగా 2 మిలియ‌న్ల వ్యూస్ అందుకోని.. త్వరలో రాబోతున్న ప‌క్కాక‌మ‌ర్షియ‌ల్ టీజ‌ర్ పై అంచ‌నాలు పెరిగేలా చేసింది. జీఏ2 పిక్చర్స్ – యూవీక్రియేష‌న్స్ బ్యాన‌ర్లు వ‌రుస విజ‌యాల‌తో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటున్నాయి. ఈ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్, టాక్సీవాలా, ప్ర‌తిరోజూ పండ‌గే వంటి సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే  గోపీచంద్, రాశీఖ‌న్నా, మారుతి కాంబినేష‌న్ లో రాబోతున్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ పై భారీగా అంచ‌నాలు ఏర్పడ్డాయి. ఇటు యూవీ క్రియేష‌న్స్ అధినేత‌లు వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్ లు.. ఇటు జీఏ2 పిక్చ‌ర్స్ నుంచి బ‌న్నీ వాసు వెరసీ ఈ స‌క్సెస్ ఫుల్ నిర్మాత‌ల నిర్మాణ సార‌థ్యంలో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అత్యంత ప్ర‌తి ష్టాత్మ‌కంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Arjun: మరో బిజినెస్ మొదలు పెట్టిన ఐకాన్ స్టార్.. థియేటర్ ఓనర్‌గా అల్లు అర్జున్

Jai Bhim: నేనూ ఇలాంటి దారుణాలు చూశాను.. హైదరాబాద్‌లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి.. ‘జై భీమ్‌’ సినిమాపై ఐఏఎస్ అధికారి స్పందన..

Fun Bucket Bhargav : ఫన్ బకెట్ భార్గవ్ మళ్లీ అరెస్ట్.. అతి చేస్తే ఇంతే.. పూర్తి వివరాలు